మల్టీక్యాప్ షేర్లలో...
అధిక ప్రతిఫలం లభిస్తుందనే లక్ష్యంతో ఇటీవల కాలంలో మదుపరులు మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాల వైపు మొగ్గుచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక మల్టీక్యాప్ పథకాన్ని ఆవిష్కరించింది.
అధిక ప్రతిఫలం లభిస్తుందనే లక్ష్యంతో ఇటీవల కాలంలో మదుపరులు మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాల వైపు మొగ్గుచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక మల్టీక్యాప్ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ‘యూనియన్ మల్టీ క్యాప్ ఫండ్’ ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) ముగింపు తేదీ ఈ నెల 12. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.1,000. ఈ పథకం కింద లార్జ్ క్యాప్ షేర్లతోపాటు, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లతో కూడిన పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. మల్టీక్యాప్ నిబంధనల ప్రకారం ఈ మూడు విభాగాల్లో, ఒక్కో విభాగానికి కనీసం 25 శాతం పెట్టుబడి కేటాయించాల్సి ఉంటుంది. ‘బాటమ్ అప్’, ‘బాటమ్ డౌన్’ పద్ధతులను అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనేది యూనియన్ మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్లు వినయ్ పహారియా, సంజయ్ బెంబాల్కర్ల ఆలోచనగా తెలుస్తోంది. ‘నిఫ్టీ 500 మల్టీక్యాప్ 50: 25:25 టీఆర్ఐ’ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించే మదుపరులకు ఈ తరహా పథకాలు అనువుగా ఉంటాయి.
కొత్త తరహా మదుపు..
ఒక కొత్త తరహా పెట్టుబడి అవకాశాన్ని బరోడా బీఎన్పీ పారిబస్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఈక్విటీ, రుణ పత్రాలు, రీట్స్/ఇన్విట్స్, బంగారం, ఈటీఎఫ్‌లలో ఒకేసారి పెట్టుబడి పెట్టే వెసులుబాటును ఈ పథకం కల్పిస్తోంది. తక్కువ రిస్కుతో స్థిరమైన ప్రతిఫలాన్ని ఆర్జించే విధంగా దీన్ని రూపొందించారు. బరోడా బీఎన్పీ పారిబస్ మల్టీ అసెట్ ఫండ్ ఎన్ఎఫ్ఓ ఈ నెల 12 వరకూ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.5,000.
ఈ పథకం కింద 65-80 శాతం నిధులను ఈక్విటీ షేర్లకు కేటాయిస్తారు. రుణపత్రాలు, గోల్డ్ ఈటీఎఫ్‌లలో 10-25 శాతం, రీట్స్/ఇన్విట్స్లలో 10 శాతం నిధులు మదుపు చేస్తారు. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనైప్పుడు, ఇతర సందర్భాల్లో ఒక విభాగంలోని పెట్టుబడుల విలువ తగ్గినప్పటికీ, మిగిలిన విభాగాల్లోని పథకాల విలువ పెరగడం లేదా స్థిరంగా ఉంటుంది. తద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన ప్రతిఫలాన్ని ఆశించవచ్చు. నిప్టీ 500 టీఆర్ఐ, నిఫ్టీ కాంపోజిట్ డెట్ ఇండెక్స్, బంగారం ధరలను ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా తీసుకుంటారు.
పెట్టుబడి.. పన్ను మినహాయింపు..
పన్ను మినహాయింపు కోసం సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకూ మదుపు చేయొచ్చు. ఇందులో ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలూ (ఈఎల్ఎస్ఎస్) ఉంటాయి. ఈ నేపథ్యంలో శామ్కో మ్యూచువల్ ఫండ్ కొత్త ఈఎల్ఎస్ఎస్ను తీసుకొచ్చింది. శామ్కో ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ పేరుతో వచ్చిన ఈ పథకంలో ఈ నెల 16 వరకూ మదుపు చేయొచ్చు. కనీస పెట్టుబడి రూ.500. పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టి, ఆకర్షణీయమైన లాభాలు ఆర్జించేందుకు ఈ ఫండ్లు తోడ్పడతాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈఎల్ఎస్ఎస్లు 12-15 శాతం వరకూ సగటు వార్షిక రాబడిని అందిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
-
World News
Earthquake: అంతులేని విషాదం.. భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..!
-
Crime News
Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురి మృతి
-
Movies News
Remix Songs: ఆ‘పాత’ మధుర గీతాలు కొత్తగా.. అప్పుడలా.. ఇప్పుడిలా!
-
Sports News
IND vs AUS: అర్ధశతక భాగస్వామ్యం నిర్మించిన బ్యాటర్లు.. ఆసీస్ స్కోరు 57/2 (25)