తీవ్ర వ్యాధులకు పరిహారం..

తీవ్ర వ్యాధులు, జబ్బుల బారిన పడినప్పుడు పరిహారం ఇచ్చేలా ఏగాస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వినూత్న పాలసీని తీసుకొచ్చింది.

Updated : 09 Dec 2022 05:40 IST

తీవ్ర వ్యాధులు, జబ్బుల బారిన పడినప్పుడు పరిహారం ఇచ్చేలా ఏగాస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వినూత్న పాలసీని తీసుకొచ్చింది. ఈ క్రిటి కేర్‌ ప్లాన్‌లో క్యాన్సర్‌ సహా దాదాపు 30 రకాల తీవ్ర వ్యాధులకు రక్షణ లభిస్తుంది. జాబితాలో పేర్కొన్న వ్యాధుల్లో ఏదైనా పాలసీదారుడికి వచ్చినప్పుడు ఈ పాలసీ వెంటనే పరిహారాన్ని చెల్లిస్తుంది. వ్యాధిని గుర్తించిన వెంటనే చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా ఒకేసారి ఈ మొత్తాన్ని అందిస్తుంది. దీనివల్ల మెరుగైన వైద్యం చేయించుకునేందుకు పాలసీదారుడికి వీలవుతుంది. ఈ పాలసీలో చేరేందుకు 18-50 ఏళ్ల వారు అర్హులు. 70 ఏళ్లు వచ్చే వరకూ పునరుద్ధరించుకోవచ్చు. ఏక మొత్తంలోనూ, పరిమిత కాలంపాటు, క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80డీ పరిమితి మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సాధారణ మెడిక్లెయిం పాలసీ ఆసుపత్రిలో చేరినప్పుడు అయిన ఖర్చులను చెల్లిస్తుంది. దీనికి అదనంగా అయ్యే వ్యయాన్ని తట్టుకునేందుకు ఈ తరహా పాలసీలు తోడ్పడతాయి. కనీసం రూ.2లక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఈ పాలసీని తీసుకోవచ్చు. 35 ఏళ్ల వ్యక్తి అయిదేళ్ల వ్యవధికి రూ.15 లక్షల పాలసీ తీసుకుంటే రూ.4,245 ప్రీమియం (జీఎస్‌టీ అదనం) వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని