వైద్య పాలసీ రూ.5 కోట్ల వరకూ

పాలసీదారుడు తనకు ఇష్టం ఉన్నట్లుగా పాలసీని తీసుకునే వీలు కల్పిస్తూ వినూత్న ఆరోగ్య బీమా పథకాన్ని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ‘మై హెల్త్‌కేర్‌ ప్లాన్‌’ పేరుతో తీసుకొచ్చింది

Published : 03 Feb 2023 00:51 IST

పాలసీదారుడు తనకు ఇష్టం ఉన్నట్లుగా పాలసీని తీసుకునే వీలు కల్పిస్తూ వినూత్న ఆరోగ్య బీమా పథకాన్ని బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ‘మై హెల్త్‌కేర్‌ ప్లాన్‌’ పేరుతో తీసుకొచ్చింది. ఓపీడీ సేవలకూ చెల్లించిన ప్రీమియానికి రెండు రెట్ల వరకూ పరిహారం ఇవ్వడం దీని ప్రత్యేకత. కనీసం రూ.3 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.5 కోట్ల వరకూ పాలసీని ఎంచుకోవచ్చు. విదేశాల్లో ఉన్నప్పుడూ బీమా రక్షణ వర్తించేలా ఇంటర్నేషనల్‌ కవర్‌ను తీసుకునే వీలుంది. ప్రసూతి ఖర్చులు, నవజాత శిశువులకు తొలి రోజు నుంచే వర్తించడంలాంటివి ఈ పాలసీలో భాగంగా ఉన్నాయి. వ్యక్తిగతంగానూ, ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని తీసుకోవచ్చు. ఏడాది, రెండు, మూడేళ్ల వ్యవధికి పాలసీని తీసుకోవచ్చు. ప్రీమియాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంది. 45 ఏళ్లలోపు వారు పాలసీ తీసుకునేందుకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ముందస్తు వ్యాధులకు 36 నెలల వేచి ఉండే వ్యవధి వర్తిస్తుంది. లాస్‌ ఆఫ్‌ ఇన్‌కం కవర్‌, మేజర్‌ ఇల్‌నెస్‌ కవర్లలాంటివి విడిగా తీసుకోవచ్చు. క్లెయిం చేయని ఏడాదిలో 50 శాతం బోనస్‌ లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని