మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్టుగా..

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా యాక్సిస్‌ బిజినెస్‌ సైకిల్స్‌ ఫండ్‌ పేరుతో కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని తీసుకువచ్చింది.

Published : 03 Feb 2023 00:51 IST

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా యాక్సిస్‌ బిజినెస్‌ సైకిల్స్‌ ఫండ్‌ పేరుతో కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 16. ఇది ఓపెన్‌ ఎండెడ్‌, థీమ్యాటిక్‌ పథకం. కనీస పెట్టుబడి రూ.5,000. యాక్సిస్‌ బిజినెస్‌ సైకిల్స్‌ ఫండ్‌కు ఆశిష్‌ నాయక్‌ ఫండ్‌ మేనేజర్‌. ఈ పథకం పనితీరును ‘నిఫ్టీ 500 టీఆర్‌ఐ ఇండెక్స్‌’తో పోల్చి చూస్తారు.

ఒక్కోసారి ఒక్కో వ్యాపార రంగం వెలుగులో ఉంటుంది. మెరుగైన పనితీరు ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ రంగం పక్కకు వెళ్లిపోయి మరొక రంగం తెరమీదకు వస్తుంది. ఇలా వ్యాపార రంగాలు మారిపోతూ ఉండటం ‘బిజినెస్‌ సైకిల్స్‌’ అని వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా వెలుగులోకి వచ్చే రంగాల్లోని కంపెనీలను ముందుగానే గుర్తించి, పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించే పథకాలే బిజినెస్‌ సైకిల్స్‌ ఫండ్స్‌. యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించిన పథకం ఈ కోవలోనిదే. మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా ఫండ్‌ మేనేజర్‌, ఈ పథకం పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను మారుస్తుంటారు. ‘టాప్‌ డౌన్‌’, ‘బాటమ్‌ అప్‌’ పద్ధతిని అనుసరిస్తూ పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. బిజినెస్‌ సైకిల్స్‌ పథకాలు తక్కువ సమయంలో అధిక ప్రతిఫలాన్ని ఆర్జించే అవకాశం లేదు. ఆ మాటకొస్తే ఎటువంటి పెట్టుబడి అయినా తగిన ప్రతిఫలాన్ని ఇవ్వటానికి సమయం పడుతుంది. అందువల్ల దీర్ఘకాలం ఎదురుచూసే వారికి ఇలాంటి పథకాలు అనువుగా ఉంటాయి.


అన్ని తరగతుల షేర్లలో..

ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక ఫ్లెక్సీ క్యాప్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ఐటీఐ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 10. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకంలో కనీస పెట్టుబడి రూ.5,000. నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోలుస్తారు. పేరులోనే ఉన్నట్లు ఏదో ఒక మార్కెట్‌ క్యాప్‌ షేర్లకే పరిమితం కాకుండా, అన్నింటిలోనూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అంటే లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో మదుపు చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. ధీమంత్‌ షా, రోహన్‌ కోర్డే, తనయ్‌ గభవాలా ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు