ఆదాయపు పన్ను.. అద్దె ఆదాయం ఉందా?
ఇంటి అద్దె ద్వారా ఆర్జించిన ఆదాయమూ పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి, ఈ మొత్తం రిటర్నులలో చూపించాల్సిందే. కొన్ని మినహాయింపులతో పన్ను భారం తగ్గించుకునే వీలునూ చట్టం కల్పిస్తోంది.
ఇంటి అద్దె ద్వారా ఆర్జించిన ఆదాయమూ పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి, ఈ మొత్తం రిటర్నులలో చూపించాల్సిందే. కొన్ని మినహాయింపులతో పన్ను భారం తగ్గించుకునే వీలునూ చట్టం కల్పిస్తోంది. దీర్ఘకాలంలో అద్దె ద్వారా ఆర్జించిన ఆదాయం వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబులనూ మార్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్తి యజమానిగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
ఏదైనా స్థిరాస్తిని అద్దెకు లేదా లీజుకు ఇచ్చినప్పుడు వచ్చిన ఆదాయాన్ని ‘ఇన్‌కం ఫ్రం హౌస్ ప్రాపర్టీ’ కింద చూపించాల్సి ఉంటుంది. ఇంటి అద్దె ద్వారా వచ్చిన మొత్తాన్ని వ్యక్తులు తమ మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, దాని ప్రకారం వర్తించే శ్లాబులను బట్టి, పన్ను చెల్లించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏ ఇతర ఆదాయాలూ లేకుండా.. కేవలం అద్దె మొత్తమే రూ.2.5లక్షల లోపు ఉందనకుందాం. అప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్ను భారమూ ఉండదు. వచ్చే ఏడాది అద్దె 20 శాతం పెరిగిందనుకుందాం.. అప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆస్కారం ఉంది. ఇక్కడ సెక్షన్ 80సీ, ఇతర మినహాయింపులనూ చూపించుకునే వీలుంటుంది. కాబట్టి, పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి పన్ను భారం ఉండదు. అద్దె ఆదాయానికీ ఇదే నిబంధనలు వర్తిస్తాయి.
ప్రామాణిక తగ్గింపు..
ఇంటి యజమాని తనకు లభించిన అద్దె ఆదాయం నుంచి కొంత ప్రామాణిక తగ్గింపును పొందే వీలుంది. స్థూల అద్దె నుంచి ఆస్తి పన్ను చెల్లించగా మిగిలిన మొత్తంలో 30 శాతం వరకూ ఈ తగ్గింపు ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి రూ.3,20,000 అద్దె వచ్చిందనుకుందాం. ఆస్తి పన్ను రూ.20వేలు చెల్లిస్తే.. మిగిలిన ఆదాయం రూ.3లక్షలు. ఇందులో 30 శాతం అంటే.. రూ.90,000. ఇప్పుడు ఇంటి అద్దె ద్వారా లభించిన నికర ఆదాయం రూ.2,10,000 అన్నమాట. పన్ను గణనలో ఈ ఆదాయాన్నే లెక్కలోకి తీసుకుంటారు. ఎన్‌ఆర్‌ఐలకూ ఇంటి, స్థిరాస్తులపై వచ్చే వడ్డీకి ఈ ప్రామాణిక తగ్గింపు వర్తిస్తుంది.
ఇంటి రుణం ఉంటే..
గృహరుణం ద్వారా కొన్న ఇంటిని అద్దెకు ఇచ్చినప్పుడూ రుణంపై చెల్లించే వడ్డీకి మినహాయింపు పొందేందుకు వీలుంది. సెక్షన్ 24 (బి) ప్రకారం రూ.2లక్షల వరకూ వడ్డీపై మినహాయింపు లభిస్తుంది.
ఉమ్మడి ఆస్తిపై..
ఆస్తిని ఉమ్మడిగా కొనుగోలు చేసినప్పుడూ.. సహ యజమానికీ పన్ను మినహాయింపులు లభిస్తాయి. క్రయ పత్రంలో పేర్కొన్న విధంగా యాజమాన్యం వాటాను బట్టి, ఇది ఆధారపడి ఉంటుంది. వాటా నిష్పత్తి ఆధారంగా చెల్లించిన వడ్డీని సెక్షన్ 24 ప్రకారం క్లెయిం చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
-
Sports News
MS Dhoni: రిజర్వ్‌డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?
-
India News
Population Census: లోక్‌సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే..!
-
Movies News
Telugu movies: చిన్న చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
Ts-top-news News
Sangareddy: గడ్డపోతారంలో విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు