Mutual Funds: స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఎంతెంత?

దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్‌ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్‌ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.

Published : 01 Jun 2023 14:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, వివిధ సంప్రదాయ పథకాలపై వచ్చే రాబడిని తక్కువ అనుకునేవారు.. రిస్క్‌కు సిద్ధపడేవారు, ఈక్విటీ మార్కెట్‌ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈక్విటీ మార్కెట్‌ల ఫలితాలు మెరుగ్గా ఉండడంతో ఆ వైపు పెట్టుబడులు బాగానే పెరుగుతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడులపై రిస్క్‌ ఉన్నప్పటికీ, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడి అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు వీటిని ఇష్టపడుతున్నారు. ఈ మ్యూచువల్‌ ఫండ్లు పెట్టుబడి కోసం స్మాల్‌ క్యాప్‌ కేటగిరీ నుంచి స్టాక్‌లను ఎంచుకుంటాయి. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు కొన్నిసార్లు నష్టాలకు కూడా సిద్ధంగా ఉండాలి.

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్‌ పద్ధతి లేదా వారి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా అయినా మ్యూచువల్ ఫండ్స్‌ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్‌సైట్ల (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ యాప్‌ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయొచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు. కాబట్టి, వీటిలో రెగ్యులర్ ప్లాన్ల కంటే 1-2 శాతం వరకు రాబడి ఎక్కువ ఉంటుంది.

3, 5, 10 సంవత్సరాలలో అధిక రాబడి అందించిన ఫండ్ల జాబితా ఇక్కడ ఉంది. 2023, మే 31 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి.

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్‌లోనూ వస్తాయని హామీ లేదు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు ఆఫర్‌ డాక్యుమెంట్స్‌ను తప్పక చదవండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని