పన్ను రిటర్నులు ఈ పత్రాలు సిద్ధం చేసుకోండి

గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం ఇది. ఈసారి కొత్తగా రిటర్నులు దాఖలు చేయబోయే వారు ఆదాయపు పన్ను పోర్టల్‌లో ముందుగా రిజిష్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Updated : 09 Jun 2023 10:23 IST

గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం ఇది. ఈసారి కొత్తగా రిటర్నులు దాఖలు చేయబోయే వారు ఆదాయపు పన్ను పోర్టల్‌లో ముందుగా రిజిష్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం, రిటర్నులను సమర్పించడం కోసం కొన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

పాన్‌ కార్డు: రిటర్నులు దాఖలు చేయడానికి కీలకం. పాన్‌ కార్డులో పేరు సరిగా ఉందా లేదా ఒకసారి తనిఖీ చేసుకోండి. ఏదైనా మార్పులుంటే వెంటనే సరిదిద్దుకునేందుకు దరఖాస్తు చేయండి.

ఆధార్‌: రిటర్నులను సమర్పించేందుకు ఆధార్‌ అవసరం. మీ పాన్‌-ఆధార్‌ అనుసంధానం పూర్తి కాకపోతే ముందుగా ఆ ప్రక్రియను ముగించండి. ఈ రెండింటిలోనూ వివరాలు సరిగ్గా ఉన్నప్పుడే అనుసంధానం అవుతాయి. జూన్‌ 30 వరకు వ్యవధి ఉన్న నేపథ్యంలో తప్పులుంటే సరిచేసుకోండి. ఆధార్‌కు అనుసంధానంగా మొబైల్‌ నంబరు ఉండాలి. అప్పుడే ఓటీపీతో ఇ-వెరిఫై చేయొచ్చు.  

ఫారం 16: మీ యాజమాన్యం ఇచ్చిన ఈ పత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా చూసుకోండి. మీ పాన్‌, ఆదాయం, టీడీఎస్‌, మినహాయింపు వివరాలను పరిశీలించండి.

బ్యాంకు వివరాలు: రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌ అవసరం అవుతాయి. వీటిని సిద్ధంగా ఉంచుకోండి. రిఫండు ఉన్నప్పుడు ఈ ఖాతాలోకే జమ అవుతుంది.

ఫారం 26 ఏఎస్‌: వివిధ ఆదాయాలు, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) వివరాలను తెలియజేసే 26 ఏఎస్‌ను మర్చిపోవద్దు. ఇందులో ఏమైనా తేడాలుంటే.. యాజమాన్యం దృష్టికి   తీసుకెళ్లండి.

మినహాయింపు: వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు పొందేందుకు చేసిన పెట్టుబడులకు తగిన ఆధారాలు ఒక చోట జాగ్రత్త   చేసుకోండి.
రిటర్నులు దాఖలు చేసేందుకు సరైన పత్రాన్ని ఎంచుకోండి. ఫారం-16తోపాటు, ఐటీఆర్‌ ఫారాన్ని, అక్నాలడ్జ్‌మెంట్‌, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను ఒకచోట భద్రంగా దాచుకోవాలి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని