50 షేర్లలో పెట్టుబడి..

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక క్వాంట్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ క్వాంట్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 24 వరకూ అందుబాటులో ఉంటుంది.

Published : 14 Jun 2024 00:31 IST

దిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక క్వాంట్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ క్వాంట్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 24 వరకూ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.500. పెట్టుబడులకు సంబంధించి ‘క్వాంట్‌ మోడల్‌’ను అనుసరించడం ఈ పథకంలోని ప్రధానాంశం. పారదర్శకత, రిస్కును సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉండటం, ఫండ్‌ మేనేజర్‌ ప్రభావం పరిమితంగా ఉండటం క్వాంట్‌ మోడల్‌లోని ప్రత్యేకతలు. ఈ విధానాన్ని అనుసరిస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు గత కొంతకాలంగా ఆకర్షణీయమైన లాభాలు నమోదు చేస్తున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఈ కొత్త పథకాన్ని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. దాదాపు 40 నుంచి 50 కంపెనీల షేర్లతో ఈ పథకం పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. నిఫ్టీ 200 టీఆర్‌ఐ సూచీని ఈ పథకానికి కొలమానంగా తీసుకుంటారు. క్వాంట్‌ పెట్టుబడి విధానంపై విశ్వాసం ఉన్న మదుపరులకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.


ప్రత్యేక సందర్భాల్లో

వ్యాపార రంగంలో కొన్ని ప్రత్యేక సందర్భాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. 2000 సంవత్సరంలో వచ్చిన వై2కే బూమ్, 2005-08 మధ్య కాలంలో వచ్చిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బూమ్, కొవిడ్‌-19 వల్ల 2020లో ఫార్మా పరిశ్రమలో వచ్చిన జోరు.. వంటివి ఈ కోవలోకి వచ్చేవే. ఇలాంటి సందర్భాలను అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి సందర్భాలుగా పేర్కొంటారు. ఇంత పెద్దవి కాకపోయినా వ్యాపార రంగంలో తెలియకుండా చాప కింద నీరులా విభిన్నమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా గమనిస్తే కానీ ఆ పరిణామాలు అర్థం కావు. వాటిని గుర్తించి, వెలుగులోకి వస్తున్న రంగాల్లోని కంపెనీలపై పెట్టుబడి పెడితే అనూహ్యమైన లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలను పరిగణనలోకి తీసుకొని పెట్టుబడి పెట్టే లక్ష్యంతో కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా కోటక్‌ స్పెషల్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 24 వరకూ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.100. నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీని దీనికి కొలమానంగా తీసుకుంటారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని