Credit card: క్రెడిట్ కార్డు కొత్తగా తీసుకుంటున్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
క్రెడిట్ కార్డుల వాడకం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఇటీవల ఆర్బీఐ మేలో విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. దేశంలో దాదాపు 7.7 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 23 శాతం పెరిగింది. అదే 2018తో పోలిస్తే
క్రెడిట్ కార్డుల వాడకం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఇటీవల ఆర్బీఐ మేలో విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. దేశంలో దాదాపు 7.7 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 23 శాతం పెరిగింది. అదే 2018తో పోలిస్తే ఇది దాదాపు 100 శాతం పెరిగింది. కార్డుల సంఖ్యే కాదు.. వీటి వినియోగం సైతం ఎంతో పెరిగింది. ఇదే సమయంలో కొత్తగా కార్డులను తీసుకుంటున్న వారూ పెరిగారు. ఈ నేపథ్యంలో తొలిసారి కార్డును వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రుణాలు లభించడం ఎంతో తేలికయ్యింది. కొత్తతరం ఫిన్‌టెక్ సంస్థలు రుణాలను అందించడంలో దూకుడుగా ఉంటున్నాయి. అయినప్పటికీ.. క్రెడిట్ కార్డుల స్థానాన్ని అవి భర్తీ చేయలేవు. క్రెడిట్ కార్డును తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న కార్డులను ముందుగా పరిశీలించండి. ఏ బ్యాంకు మీకు కార్డు అందించేందుకు ముందుకు వచ్చింది, అది అందించే ప్రయోజనాలు తెలుసుకోండి. మీ జీవన శైలికి ఏ కార్డు ఎక్కువగా ఉపయోగపడుతుంది చూసుకోండి. మీరు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తారనుకుంటే.. ఆ కొనుగోళ్లపై అధిక రివార్డులు ఇచ్చే కార్డును తీసుకోవాలి. గృహోపకరణాలు కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును ఈఎంఐగా మార్చుకుంటే.. వడ్డీ లేకుండా ఈ వెసులుబాటునిచ్చే కార్డు పనికొస్తుంది. ఇలా అవసరం ఏమిటి? ఏ రకం కార్డు దానికి ఉత్తమం అని కాస్త పరిశోధించాకే తీసుకోవడం మేలు.
సమయానికి..
రుణం ఏదైనా సరే.. దాన్ని సకాలంలో తీర్చాల్సిన బాధ్యత రుణగ్రహీతపైన ఉంటుంది. కార్డు బిల్లునూ నిర్ణీత గడువులోపు తీర్చడం ఎప్పుడూ మంచిది. కనీస చెల్లింపుతోనే సరిపెడితే.. వడ్డీల భారం మోయాల్సి వస్తుంది. అదీ చెల్లించకపోతే.. రుసుములు భారీగానే ఉంటాయి. సాధారణంగా కార్డును వాడేదే.. రివార్డు పాయింట్లు, ఇతర తగ్గింపులు వస్తాయని. గడువు లోపు బిల్లు చెల్లించకపోతే.. వడ్డీ, రుసుములు అధికంగా చెల్లించాల్సి వస్తే.. రివార్డుల లాభం అటుంచి, భారంగా మారుతుంది. నిర్ణీత తేదీనాడు బిల్లులకు నేరుగా చెల్లింపు జరిగేలా బ్యాంకు ఖాతా నుంచి ఏర్పాటు చేయండి.
పరిమితికి లోపే..
క్రెడిట్ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30 శాతానికి మించి వాడకూడదు. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. తక్కువ ఖర్చు చేయడం వల్ల బిల్లు చెల్లింపులోనూ ఇబ్బంది ఉండదు. రుణ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది. 750పైన స్కోరున్నప్పుడు కొత్త రుణాలు తీసుకోవడం సులభమవుతుంది. నియంత్రణ లేకుండా ఖర్చు చేసి, తర్వాత బిల్లు చెల్లించకపోతే.. క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
సురక్షితంగా...
కరోనా తర్వాత డిజిటల్ లావాదేవీలు ఎంతో ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగాయి. ఇదే సమయంలో సైబర్ మోసాలూ పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే కార్డు తీసుకుంటున్నవారూ.. మన దగ్గరున్న కార్డుతో లావాదేవీలు చేస్తున్నవారూ పెరిగారు. కాబట్టి, క్రెడిట్ కార్డు వాడకం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. కార్డు సంఖ్య, సీవీవీ, ఓటీపీల్లాంటివి ఎవరికీ ఇవ్వకూడదు. కార్డు ఎప్పుడూ మీ దగ్గరే ఉండాలి. మీరు చేస్తున్న చెల్లింపులకు రెండంచెల భద్రత ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
కార్డును తీసుకోవడంతోనే సరిపోదు. దానికి సమయానికి చెల్లింపులు చేస్తూ.. భారం పడకుండా చూసుకోడమూ ముఖ్యమే. అప్పుడే క్రెడిట్ కార్డు అందించే పూర్తి ప్రయోజనాలను సొంతం చేసుకోగలరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఆర్డీలపై వివిధ బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేట్లు ఇవే..
దేశంలో దాదాపు అన్ని బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ అందిస్తున్నాయి. ఈ ఆర్డీలపై వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూడండి. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
గృహ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే..
మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి, ఇంటి రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు. -
క్రెడిట్ కార్డు బాధ్యతగా వాడండి
మీ జేబులో ఉన్న క్రెడిట్ కార్డు.. ఒక అద్భుతమైన ఆర్థిక సాధనం. చేతిలో డబ్బు లేకపోయినా కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు సరైన మార్గంలో ఉపయోగిస్తే.. అది మీ కోసం ఎన్నో పనులు చేస్తుంది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన బజాజ్ ఫైనాన్స్.. వారికి 8.85% వరకు వడ్డీ
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85 శాతం, సాధారణ పౌరులకు 8.6 శాతం వడ్డీ అందిస్తోంది. -
‘అమృత్ కలశ్’ గడువు మరోసారి పెంపు.. ఎప్పటి వరకంటే?
SBI news: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ‘అమృత్ కలశ్’ డిపాజిట్ పథకం గడువును మరోమారు పొడిగించింది. -
విదేశీ విద్యా రుణాలు, వివిధ అంశాల గురించి తెలుసుకోండి?
విద్యార్థులు విదేశీ చదువుకు..రుణ సంస్థల నుంచి పొందే ఆర్థిక సహాయంతో పాటు కొన్ని ముఖ్యమైన ఇతర అంశాల గురించి తెలుసుకోవాలి, అవేంటో ఇక్కడ చూడండి. -
రుణాలు.. తొందరగా తీర్చేద్దాం
అవసరానికి అప్పు చేయడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తొందరగా తీర్చేయడమే ఆర్థిక క్రమశిక్షణ. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు.. ఇలా సులభంగా రుణం దొరికే మార్గాలున్న రోజుల్లో మన వద్ద లేని డబ్బును ఖర్చు చేసేప్పుడు ఆలోచించాల్సిందే. -
రూపే కార్డు వాడుతున్నారా? యూపీఐ యాప్ ద్వారా ఇక EMIగా మార్చుకోవచ్చు!
రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. యూపీఐ యాప్‌లో త్వరలో కొన్ని కొత్త ఫీచర్లు పలకరించబోతున్నాయి. -
బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
Flash Pay: కీ చైన్‌తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడుకోవచ్చా?
Credit Card: క్రెడిట్ వాడకంపై తరచూ ఎదురయ్యే కొన్ని కీలక సందేహాలకు ఇటీవల ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..! -
వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు
ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్‌లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!