కార్డుతో నగదు వెనక్కి

క్రెడిట్‌ కార్డుతో నిర్వహించే అన్ని ఆన్‌లైన్‌ లావాదేవీలపై 5 శాతం వరకూ నగదు వెనక్కిచ్చేలా ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ కొత్త కార్డును ఆవిష్కరించింది.

Updated : 02 Sep 2022 05:02 IST

క్రెడిట్‌ కార్డుతో నిర్వహించే అన్ని ఆన్‌లైన్‌ లావాదేవీలపై 5 శాతం వరకూ నగదు వెనక్కిచ్చేలా ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ కొత్త కార్డును ఆవిష్కరించింది. ‘క్యాష్‌ బ్యాక్‌ ఎస్‌బీఐ కార్డు’ను వాడినప్పుడు సాధారణ లావాదేవీలపై 1 శాతం నగదు వెనక్కి వస్తుంది. అదే సమయంలో ఆన్‌లైన్‌ వ్యవహారాల్లో 5 శాతం నగదును క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌గా ఇస్తుంది. ఒక బిల్లింగ్‌ నెలలో గరిష్ఠంగా రూ.10వేల కొనుగోలు వరకే ఈ నగదు వెనక్కి సౌకర్యం లభిస్తుంది. కార్డు లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ వచ్చిన రెండు రోజుల్లో నగదు వెనక్కి ద్వారా ఇచ్చిన మొత్తం కార్డు ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇంధన కొనుగోలుపై గరిష్ఠంగా రూ.100 వరకూ సర్‌ఛార్జీని రద్దు చేస్తుంది. ఈ కార్డు కోసం వార్షిక రుసుము రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2లక్షల వరకూ బిల్లింగ్‌ చేసినప్పుడు ఈ ఫీజును కార్డు వెనక్కి ఇస్తుంది. మార్చి వరకూ కార్డును తీసుకున్న వారికి మొదటి ఏడాది సభ్యత్వ రుసుము ఉండదని ఎస్‌బీఐ కార్డ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని