అప్పుల భారం తగ్గించుకుందాం..
అవసరం ఏమిటన్నది చూడకుండా అప్పు ఇచ్చే సంస్థలు ఇప్పుడు కోకొల్లలు. ఇస్తున్నారు కదా అని మనం తీసుకుంటే.. తర్వాత అది మనకు గుదిబండగా మారుతుందనడంలో సందేహం లేదు.
సంపాదన పెరుగుతోంది. కానీ, అదే స్థాయిలో ఖర్చులూ అధికంగానే ఉంటున్నాయి. ఇల్లు, కారు, మొబైల్ ఫోన్ ఏది కొనాలన్నా అప్పు చేయడం తప్పనిసరి అయ్యింది. ఇతర అవసరాలకూ వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోతోంది. దీంతో తమకు తెలియకుండానే చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీని నుంచి త్వరగా బయటపడేందుకు ఏం చేయాలి? తెలుసుకుందాం.
అవసరం ఏమిటన్నది చూడకుండా అప్పు ఇచ్చే సంస్థలు ఇప్పుడు కోకొల్లలు. ఇస్తున్నారు కదా అని మనం తీసుకుంటే.. తర్వాత అది మనకు గుదిబండగా మారుతుందనడంలో సందేహం లేదు. అందుకే, అప్పు తీసుకునేటప్పుడు మొదలు.. దాని చివరి వాయిదాలు చెల్లించేదాకా జాగ్రత్తగానే ఉండాలి.
ఉదాహరణకు ఇప్పుడు గృహరుణం మీద 8.40-8.65 శాతం వడ్డీ విధిస్తున్నారు. రెపో రేటు 4 శాతం ఉన్నప్పుడు ఈ రేటు 7 శాతం లోపే. దీంతో చాలామందికి గృహరుణ అర్హత పెరిగింది. ఇచ్చినంత మొత్తాన్ని తీసుకున్నారు. ఇప్పుడు వడ్డీ రేటు పెరగడంతో ఈఎంఐ భారం లేకున్నా.. వ్యవధి కొన్నేళ్లపాటు అధికమయ్యింది. అంతే, రుణ భారం పెరిగినట్లే కదా. అందుకే, అప్పు తీసుకునేటప్పుడు భవిష్యత్తులో వడ్డీ రేటు పెరిగితే ఎలా అనేదీ ఆలోచించాలి.
40-50 శాతం మించకుండా..
సరైన ప్రణాళికలు ఉంటేనే అప్పులను నిర్వహించడం సులభం అవుతుంది. అధిక మొత్తంలో అప్పు ఇస్తున్నప్పటికీ మనకు ఎంత అవసరమో అంతే తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక సూత్రాల ప్రకారం ఒక వ్యక్తి తన ఆదాయంలో 40-50శాతానికి మించి అప్పుల వాయిదాలు చెల్లించకూడదు. 40 శాతం లోపు ఉండటం ఇంకా మంచిది. ఈ పరిమితి దాటితే వాయిదాలు కట్టడంలో ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది. అప్పుల వాయిదాలు బాగా పెరిగితే ఇతర ఖర్చులకు రాజీ పడాల్సి వస్తుంది. ఆదాయం పెరుగుతుందని ఊహించకుండా.. ఇప్పుడున్న ఆదాయంలో 40 శాతం ఈఎంఐకి ఎంత మేరకు అప్పు తీసుకుంటే బాగుంటుందో చూసుకోండి. పరిమితిని దాటనీయకండి.
చెల్లింపులను పెంచండి..
అధిక వడ్డీ రేటుతో వచ్చే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల వల్ల అప్పటికప్పుడు అవసరాలు తీరిపోతాయి. కానీ, ఈ అప్పులు ఎక్కువ సమయం కొనసాగించడం మంచిది కాదు. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు అధికంగా ఉంటే, ఖర్చులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. తక్కువ పరిమితితో ఉన్న క్రెడిట్ కార్డును మాత్రమే వాడండి. ఎక్కువ బాకీ ఉండి, కనీస మొత్తం చెల్లిస్తూ ఉన్నవాటిని తొందరగా తీర్చే ఏర్పాటు చేసుకోవాలి. అప్పులు తొందరగా తీరాలంటే వాయిదా మొత్తాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. గృహరుణానికి ఏడాదికి కనీసం నాలుగు ఈఎంఐలైనా అధికంగా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి.
క్రమం తప్పకుండా..
రుణ వాయిదాలను ఆలస్యం చేయకుండా చెల్లించడం ఎప్పుడూ ముఖ్యం. సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుములు భారీగా ఉంటాయి. ఇలా తరచూ జరుగుతుంటే సిబిల్ స్కోరుపైనా ప్రభావం పడుతుంది. మీరు చెల్లించే రుణ వాయిదాలే కాదు.. కరెంటు, ఫోన్, ఇతర బిల్లులనూ గడువులోపు చెల్లించే అలవాటు చేసుకోండి. లేకపోతే అపరాధ రుసుమలు తప్పవు. చిన్న మొత్తాలే అనుకొని నిర్లక్ష్యం చేయొద్దు.
ఖర్చులకు కళ్లెం వేస్తేనే..
అనవసరమైన విలాసాలు తగ్గించుకోవాలి. అప్పుడే కోరుకున్న ఆర్థిక స్థాయికి వెళ్లగలం. కుటుంబమంతా కలిసి ఆర్థిక ప్రణాళికలను రచించుకోవాలి. వాటిని విపులంగా చర్చించి, ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అప్పుల నుంచి త్వరగా బయటపడే మార్గాలను అన్వేషించాలి. వాటిని ఆచరణలో పెట్టేలా క్రమశిక్షణ పాటించాలి. అప్పులు తొందరగా తీరితే.. ఆ మేరకు వాయిదాల భారం తగ్గుతుంది. ఖర్చులు పెట్టుకునేందుకు కాస్త వెసులుబాటూ దొరుకుతుంది. కాబట్టి, అధికంగా ఖర్చు చేస్తూ.. వడ్డీ భారం మోయడం కన్నా.. ముందుగా అప్పులు చెల్లించి, మిగులు మొత్తాన్ని వాడుకోవడం ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకుల్లో లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇవే!
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్ స్పందించింది. -
Flash Pay: కీ చైన్‌తో పేమెంట్స్.. ఫెడరల్ బ్యాంక్ నుంచి ఫ్లాష్ పే
Federal Bank flash pay: ఫెడరల్ బ్యాంక్ స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం దీన్ని వినియోగించుకోవచ్చు. -
పిల్లల పేరిట ఎఫ్డీ
పెట్టుబడికి రక్షణ, రాబడికి హామీ ఉన్న పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న తల్లిదండ్రులు వీటికి ప్రాధాన్యం ఇస్తుంటారు -
సిబిల్ నివేదికలో తప్పులుంటే
రుణం తీసుకోవాలంటే.. బ్యాంకులు ముందుగా పరిశీలించేది క్రెడిట్ నివేదికనే. ఇందులో ఎలాంటి తప్పులూ దొర్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనకు అవసరం ఉన్నప్పుడు రుణం కోసం వెళ్తే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. -
Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్?
ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం... -
Home loan: జీరో ప్రాసెసింగ్ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్
Bank of India home loan offer: బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ ప్రకటించింది. -
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడుకోవచ్చా?
Credit Card: క్రెడిట్ వాడకంపై తరచూ ఎదురయ్యే కొన్ని కీలక సందేహాలకు ఇటీవల ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..! -
వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు
ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు. -
Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.. -
FD Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఇవే..
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి. -
పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి?
వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే ఆదాయ-వ్యయాలన్నింటికీ ఆధారం ఇదే. బ్యాంకు, మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి, ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. వేతనం ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. -
Car Loans: కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం. -
Credit Cards: హెచ్డీఎఫ్సీ నుంచి ఐదు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులు
Credit Cards: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల నాలుగు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాటి ఫీచర్లు, జాయినింగ్ ఫీజు, అర్హతల వంటి వివరాలను చూద్దాం.. -
Two wheeler insurance: బైక్ ఇన్సూరెన్స్.. ఇవన్నీ తెలుసుకున్నాకే..!
Two wheeler insurance: మీ టూవీలర్‌కు బీమా చేయించాలని చూస్తున్నారా? మంచి పాలసీ తెలుసుకోలేకపోతున్నారా? ఈ కింది విషయాలపై ఓ లుక్కేయండి. -
గృహరుణం ఇప్పుడేం చేయాలి?
ఏడాది కాలంగా రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీన్ని పెంచకపోవడం మంచి పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించేంతగా సహకరించడం లేదు. -
కార్పొరేట్ బాండ్లు ఎంచుకోండి జాగ్రత్తగా
మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. నిర్ణీత కాలానికి, స్థిరమైన వడ్డీని అందించే వీటిని చాలామంది ఇష్టపడతారు. -
Saving Account: పొదుపు ఖాతా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
బ్యాంకులో పొదుపు ఖాతా అనేది ఖాతాదారుడికి ఒక విభిన్నమైన ఆర్థిక సాధనం. ఇది ఖాతాదారుడికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. -
Fixed Deposits: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధుల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.75% వడ్డీని పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్