క్రెడిట్ స్కోరు.. మీపై నమ్మకం పెంచేలా..
ఆర్థికంగా మీరు క్రమశిక్షణగా ఉన్నారా? తీసుకున్న రుణాలకు వాయిదాలు సరిగ్గా చెల్లిస్తున్నారా? కొత్తగా అప్పు తీసుకునేందుకు మీకు అర్హత ఉందా? ఇవన్నీ ఎలా తెలుస్తాయి అనుకుంటున్నారా? మీ క్రెడిట్ నివేదిక చూస్తే చాలు.. మీ ఆర్థిక అలవాట్లను అర్థం చేసుకునేందుకు.
ఆర్థికంగా మీరు క్రమశిక్షణగా ఉన్నారా? తీసుకున్న రుణాలకు వాయిదాలు సరిగ్గా చెల్లిస్తున్నారా? కొత్తగా అప్పు తీసుకునేందుకు మీకు అర్హత ఉందా? ఇవన్నీ ఎలా తెలుస్తాయి అనుకుంటున్నారా? మీ క్రెడిట్ నివేదిక చూస్తే చాలు.. మీ ఆర్థిక అలవాట్లను అర్థం చేసుకునేందుకు. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందంటే మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. మరి, ఈ స్కోరు తగ్గకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.
మంచి క్రెడిట్ స్కోరు ఉందంటే కేవలం రుణాలను తీసుకునేందుకు అర్హత పెరిగిందనే కాదు.. ఆర్థిక విషయాల్లో మీరు ఎంతో క్రమశిక్షణతో ఉన్నారన్నమాట. కొత్తగా రుణాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు రుణదాతలు సిబిల్ స్కోరును పరిశీలిస్తాయి. మీ దరఖాస్తు తిరస్కరించకుండా.. ఆమోదించారంటే మిమ్మల్ని బ్యాంకు/ఆర్థిక సంస్థకు విశ్వాసం ఉందని. ఒక్కసారి ఈ స్కోరు తగ్గిందా.. మళ్లీ దీన్ని పెంచుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
చెల్లింపుల క్రమం తప్పొద్దు..
రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించినప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. ముఖ్యంగా పండగల వేళ కొనుగోళ్లు అధికంగా చేసి ఉంటారు. కొత్తగా రుణం తీసుకోవచ్చు. వీటన్నింటినీ సకాలంలో తీర్చే ప్రయత్నం చేయండి. ఆలస్యం చేస్తే.. మున్ముందు రుణాల లభ్యత అంత తేలిక కాదన్నది గుర్తుంచుకోండి. సాధ్యమైనంత వరకూ బడ్జెట్‌కు కట్టుబడి ఉంటే.. రుణాల గందరగోళం ఉండదు. మీ ఆదాయంలో 40 శాతానికి మించి వాయిదాలు ఉండకుండా చూసుకోవడం ఎప్పుడూ మంచిది. బ్యాంకులో కనీసం రెండు నెలల వాయిదాలకు సరిపడా మొత్తం అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడే వాయిదాలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చెల్లించవచ్చు.
పాత కార్డులే మేలు..
కొత్తగా ఎన్ని క్రెడిట్ కార్డులు తీసుకున్నా.. మీరు తొలిసారిగా తీసుకున్న కార్డునే వీలైనంత వరకూ వాడేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మీ రుణ చరిత్రకు విలువ ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోరు పెరిగేందుకూ ఉపయోగపడుతుంది.
రుణాల సంఖ్య పరిమితంగా..
బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను ఇస్తామంటూ సందేశాలు పంపిస్తూనే ఉంటాయి. వీటిని క్లిక్ చేయడం, అడిగిన ప్రాథమిక వివరాలు సమర్పించడం వల్ల మీరు రుణానికి దరఖాస్తు చేసుకున్నట్లే అవుతుంది. రుణాలు తీసుకునేందుకు మీరు అమితాసక్తి చూపిస్తున్నారని రుణదాతలు భావిస్తారు. ఫలితంగా క్రెడిట్ స్కోరుతోపాటు, మీపై విశ్వాసమూ తగ్గుతుంది.
హామీ.. సహ-దరఖాస్తు..
ఇతరులు తీసుకున్న రుణానికి మీరు హామీ సంతకం చేశారా? ఎవరికైనా సహ-దరఖాస్తుగా కొనసాగుతున్నారా? వారు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించేలా చూసే బాధ్యతనూ మీరు తీసుకోక తప్పదు. వారు చెల్లించకపోతే మీ క్రెడిట్ నివేదికపై దాన్ని పేర్కొంటారు. ఫలితంగా స్కోరు తగ్గుతుంది. కాబట్టి, సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
సకాలంలో వాయిదాలు, బిల్లులు చెల్లిస్తున్నా సరే.. కొన్నిసార్లు క్రెడిట్ నివేదికలో అవి సరిగా నమోదు కాకపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి, కనీసం ఏడాదికోసారైనా మీ క్రెడిట్ నివేదికను తనిఖీ చేసుకోండి. తప్పులు ఉంటే బ్యాంకులను, క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి, వాటిని సరిచేసుకోండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
General News
TSPSC Paper Leak Case: సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు
-
Politics News
PM Modi: భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో అధిష్ఠానం కీలక భేటీ