డెబిట్ కార్డు..ఈ విషయాలు తెలుసా?
బ్యాంకు పొదుపు ఖాతాతో పాటు మనకు అందే మరో సౌలభ్యం డెబిట్ కార్డు. ఏటీఎం నుంచి నగదు తీసుకోవడంతోపాటు, కొనుగోళ్ల లావాదేవీలు చేసేందుకూ దీన్ని ఉపయోగించుకోవచ్చు.
బ్యాంకు పొదుపు ఖాతాతో పాటు మనకు అందే మరో సౌలభ్యం డెబిట్ కార్డు. ఏటీఎం నుంచి నగదు తీసుకోవడంతోపాటు, కొనుగోళ్ల లావాదేవీలు చేసేందుకూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. వీటిని మరింత సమర్థంగా వాడేందుకు కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే దీని ప్రయోజనాలు పూర్తిగా అందుకోవచ్చు.
బ్యాంకు ఖాతాకు అనుసంధానంగా ఉండే డెబిట్ కార్డును.. నగదుకు ఎలక్ట్రానిక్ రూపంగా చెప్పొచ్చు. వ్యాపారులు, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసినప్పుడు చెల్లింపు చేయడంతోపాటు, దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంల నుంచి డబ్బు తీసుకునేందుకూ ఇది వీలు కల్పిస్తుంది.
క్రెడిట్ కార్డుకు భిన్నంగా..
క్రెడిట్ కార్డులు బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉండవు. ఇవి ఒక రకంగా బ్యాంకు మనకు ఇచ్చే తాత్కాలిక రుణం. కొనుగోలు శక్తిని పెంచడంలో ఇవి సహాయం చేస్తాయి. వీటిని కాస్త జాగ్రత్తగా వాడుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. నగదు వెనక్కి, రివార్డు పాయింట్లు, రాయితీలు లభిస్తాయి. డెబిట్ కార్డు మీ ఖాతాలో ఉన్న నిల్వ మేరకే వాడుకునేందుకు అనుమతినిస్తుంది. అంతకుమించి నిధులను మీరు వాడలేరు.
పరిమితులు ఉంటాయి..
డెబిట్ కార్డులకు రోజువారీ ఉపసంహరణ, కొనుగోలు పరిమితులు ఉంటాయి. మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు బ్యాంకులు ఈ ఏర్పాటు చేస్తాయి. కొనుగోలు, ఏటీఎంల నుంచి నగదు తీసుకునేప్పుడు అసౌకర్యం కలగకుండా, ముందుగానే ఈ పరిమితుల గురించి తెలుసుకోవాలి.
రుసుములు..
డెబిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదు తీసుకోవచ్చు. సొంత బ్యాంకు ఏటీఎంలను వాడినప్పుడూ పరిమితి దాటితే రుసుములు తప్పవు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసినప్పుడూ కొన్ని నిబంధనల మేరకు రుసుములు విధిస్తారు. వీటి గురించి అవగాహన ఉండాలి. లేకపోతే నష్టపోతాం.
కొన్ని ప్రత్యేక డెబిట్ కార్డులు ఓవర్‌డ్రాఫ్ట్ వెసులుబాటునూ అందిస్తాయి. ఖాతాలో నిధులు లేకపోయినా కొన్ని లావాదేవీలను పూర్తి చేసేందుకు అనుమతిస్తాయి. ఇలాంటి కార్డులు విధించే రుసుములు, వడ్డీ రేట్ల గురించి ముందే తెలుసుకోవాలి.
గమనిస్తూ ఉండాలి..
అనధికార లేదా మోసపూరిత కొనుగోళ్లను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు మీ ఖాతా వివరాలను సరిచూసుకుంటూ ఉండాలి. సంక్షిప్త సందేశాలనూ చూస్తుండాలి. మీరు చేయని లావాదేవీల గురించి సమాచారాన్ని వెంటనే బ్యాంకులకు తెలియజేయాలి.
అంతర్జాతీయంగా..
విదేశాలకు వెళ్లే ముందు మీ ప్రయాణం గురించి బ్యాంకుకు తెలియజేయండి. మీరు వెళ్తున్న దేశాల్లో కార్డును వాడేందుకు వీలుందా తెలుసుకోండి. సాధారణంగా బ్యాంకులు అంతర్జాతీయ సేవలను డిఫాల్ట్‌గా నిలిపివేస్తాయి. మోసాలను నివారించేందుకు ఈ జాగ్రత్త తీసుకుంటాయి. ఖాతాదారులు చెప్పినప్పుడే వినియోగానికి అనుమతిస్తాయి. బ్యాంక్ ఆన్‌లైన్, మొబైల్ యాప్‌లోనూ దీన్ని ‘యాక్టివేట్’ చేసుకోవచ్చు.
వివరాలు భద్రంగా..
డెబిట్ కార్డు వివరాలు అత్యంత రహస్యం. కార్డు వివరాలు, ఏటీఎం పిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దు. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలలో మీ పిన్‌ను నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కార్డు వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించే స్కిమ్మింగ్ పరికరాలు, వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
కార్డు పోతే..
డెబిట్ కార్డు కనిపించకపోతే వెంటనే మీ బ్యాంకుకు ఆ విషయం తెలియజేయండి. సత్వర చర్యలు తీసుకుంటేనే అనధికార వినియోగాన్ని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన చిట్కాలను తెలుసుకోవడం ద్వారా మీ డెబిట్ కార్డును సరైన సమాచారంతో ఉపయోగించుకునే వీలుంటుంది. అప్పుడే మోసపూరిత కార్యకలాపాల నుంచి మీ ఖాతాను రక్షించుకోవచ్చు.
అధిల్ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AIADMK: మళ్లీ ఎన్డీయేలో చేరం.. అన్నామలైని తొలగించాలని మేం కోరం: అన్నాడీఎంకే
-
USA: అమెరికా పిల్లలకి ‘లెక్కలు’ రావడం లేదట..!
-
MS Swaminathan: దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది: కేసీఆర్
-
Shakib - Tamim: జట్టు కోసం కాదు.. నీ ఎదుగుదల కోసమే ఆడతావు: తమీమ్‌పై షకిబ్ సంచలన వ్యాఖ్యలు
-
Kami Rita: నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
Donald Trump: మిమ్మల్ని ఇకనుంచి ‘డొనాల్డ్ డక్’ అంటారు: ట్రంప్‌పై తోటినేతల విమర్శలు