క్రెడిట్ కార్డు.. సరైనది ఎంచుకోండి
రుణాలు తీసుకోవడం ఎంతో సులభంగా మారిన కాలంలో మనం ఉన్నాం. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్రెడిట్ కార్డు గురించి. చేతిలో డబ్బు లేకపోయినా అవసరమైనది కొనుగోలు చేసేందుకు ఇది తోడ్పడుతుంది.
రుణాలు తీసుకోవడం ఎంతో సులభంగా మారిన కాలంలో మనం ఉన్నాం. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్రెడిట్ కార్డు గురించి. చేతిలో డబ్బు లేకపోయినా అవసరమైనది కొనుగోలు చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మన అవసరాలకు సరిపోయే కార్డును ఎంచుకోవడమే కీలకం.
అవసరం ఏమిటి అన్నది చెబితే చాలు.. దానికి తగ్గట్టుగా క్రెడిట్ కార్డును తీసుకునే వీలుంది. వస్తువుల కొనుగోలు, విదేశీ యాత్రలు, అత్యవసర వైద్య ఖర్చులు ఇలా దేని కోసం మీరు కార్డును తీసుకోవాలని అనుకుంటున్నారో ముందుగా స్పష్టంగా తెలుసుకోండి.
క్రెడిట్ కార్డులను తెలివిగా, బాధ్యతగా ఉపయోగిస్తే ఎంతో ప్రయోజనకరమే. నిర్ణీత పరిమితి వరకూ వీటిని వాడుకోవడం ద్వారా అత్యవసరాల్లో ఆర్థిక ఇబ్బందులూ ఉండవు. అదనంగా ఇవి అందించే రివార్డు పాయింట్లు, లాయల్టీలూ ఉంటాయి. కొనుగోళ్లపై ఆదా చేయడంలో ఇవి మీకు సహాయపడతాయి. సకాలంలో బాకీ చెల్లిస్తే చాలు. ఎలాంటి రుసుములూ ఉండవు.
మీ ఖర్చుల అలవాట్లకు అనుగుణంగా ఉండే క్రెడిట్ కార్డును ఎంచుకోవడం ఎంతో కీలకం. చాలా కార్డులు కిరాణా, వినోదం, ప్రయాణం తదితర ఖర్చులపై నగదు వెనక్కి, రాయితీలను అందిస్తాయి. నిర్దిష్ట ఖర్చులకు అనుగుణంగా రూపొందించిన కార్డులూ ఉన్నాయి. ఉదాహరణకు మీరు తరచుగా ప్రయాణిస్తుంటే ఎయిర్ మైల్స్ లేదా హోటల్ బుకింగ్‌లపై డిస్కౌంటును అందించే క్రెడిట్ కార్డులు మీకు ఖర్చులను ఆదా చేయడంలో సహాయం చేస్తాయి. మీరు ఎంచుకున్న కార్డుతో సంబంధం లేకుండా, ఎప్పుడూ దాని నిబంధనలు, షరతులను జాగ్రత్తగా తెలుసుకోండి. ముఖ్యంగా వడ్డీ రేట్లు, వార్షిక రుసుములు, జరిమానాలకు సంబంధించి నియమాలు చూసుకోండి.
క్రెడిట్ కార్డులు స్వల్పకాలిక ఆర్థిక అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. వీటిని వినియోగించుకొన్నప్పుడు, సమయానుగుణంగా చెల్లించే బిల్లులతో క్రెడిట్ స్కోరును నిర్మించుకోవచ్చు. ఇల్లు, వాహనం కొనడం తదితర సందర్భాల్లో రుణం తీసుకున్నప్పుడు ఈ క్రెడిట్ స్కోరు వడ్డీ భారాన్ని తగ్గించడంలో సాయం చేస్తుంది.
పరిశోధించండి: ఏ కార్డును ఎంచుకోవాలో ముందుగా చూసుకోండి. దానికి సంబంధించిన రుసుము, వడ్డీ రేటు, ఆలస్య చెల్లింపు రుసుములు తదితర వివరాలతో సహా దాని నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవండి.
తక్కువ పరిమితితో: మీరు కొత్తగా క్రెడిట్ కార్డును తీసుకుంటున్నారా? తొలుత తక్కువ పరిమితి కార్డును ఎంచుకోండి. ఇది మీ పరిధిలో ఖర్చు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరును నిర్మించడంలోనూ సహాయం చేస్తుంది.
బిల్లును సకాలంలో: క్రెడిట్ చరిత్రను నిర్మించేందుకు అత్యంత సులభమైన మార్గాల్లో ఒకటి.. క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం. బిల్లు ఆలస్యమైతే రుసుములు భారంగా ఉంటాయి.
బాధ్యతగా: క్రెడిట్ కార్డులను బాధ్యతగా ఉపయోగించాలి. మీ ఆర్థిక స్తోమతకు మించి అప్పు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. మీ క్రెడిట్ కార్డుపై బాకీని ఎప్పుడూ పూర్తిగా చెల్లించండి. కనీస మొత్తం చెల్లిస్తే.. వడ్డీ భారం తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gandhi Jayanti: మహాత్ముడి బోధనలు.. మన మార్గాన్ని వెలిగించాయి: గాంధీజీకి ప్రముఖుల నివాళి
-
Trudeau- Elon Musk: ట్రూడో మీకిది సిగ్గుచేటు.. విరుచుకుపడ్డ ఎలాన్ మస్క్
-
Upcoming Movies: ఈ వారం థియేటర్లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీ చిత్రాలివే!
-
Art of living: వాషింగ్టన్ డీసీలో మార్మోగిన శాంతి మంత్రం
-
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
-
Eluru: యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ మృతి