క్రెడిట్ స్కోరు తగ్గితే
ఒక వ్యక్తి ఆర్థిక విషయాల్లో ఎంత క్రమశిక్షణతో ఉన్నారో క్రెడిట్ స్కోరు వెల్లడిస్తుంది. కావాల్సినప్పుడు వెంటనే రుణాలు పొందాలంటే ఈ స్కోరు మీకు ఒక అస్త్రంగా పనిచేస్తుంది. కీలకమైన ఈ క్రెడిట్ స్కోరు కొన్నిసార్లు తగ్గిపోతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఏయే సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉంది? ఇలాంటప్పుడు ఏం చేయాలి?
క్రెడిట్ స్కోరు తగ్గిపోయిందని గుర్తించిన వెంటనే నివేదికను ఒకసారి పరిశీలించండి. కొత్తగా మీకు తెలియకుండా ఏదైనా అప్పు మీ ఖాతాలో చేరిందా చూసుకోండి. తీసుకున్న రుణాలకు వాయిదాల చెల్లింపు ఆలస్యమయ్యిందా? క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లించారా చూసుకోండి. కొన్నిసార్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాలతో క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నివేదికను జాగ్రత్తగా గమనిస్తే.. కారణాలేమిటో తెలుసుకోవచ్చు. వాటిని సరిచేసుకోవడం ద్వారా మళ్లీ స్కోరు గాడిన పడేలా చూసుకోవచ్చు.
వాయిదాలు ఆలస్యం: సాధారణంగా ఈఎంఐలను ఆలస్యంగా చెల్లించినా.. లేదా చాలా కాలంగా వాటిని పట్టించుకోకపోయినా.. క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. ఒకసారి ఈఐఎంని సకాలంలో చెల్లించకపోతే.. తర్వాత దీనిని క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా స్కోరును సరిచేసుకోవచ్చు. ఎప్పుడూ ఆలస్యం చేస్తుంటే.. స్కోరును పెంచుకోవడం కుదరని పని. సమయానికి చెల్లించడం అనేది మీ చేతిలో పనే. దీన్ని పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
పరిమితిలోపే..
క్రెడిట్ కార్డులను ఎప్పుడూ పరిమితిలోపే వినియోగించాలి. అంతేకాదు.. కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడితే.. మీరు మొత్తం రుణాలపైనే ఆధారపడుతున్నారని బ్యాంకులు అర్థం చేసుకుంటాయి. కాబట్టి, మీ క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడొద్దు. 90 శాతం వాడితే.. స్కోరుపై ప్రభావం ఉంటుంది. ఒకవేళ మీ స్కోరు క్రెడిట్ కార్డును అధికంగా వాడటం వల్ల తగ్గిందని భావిస్తే.. వెంటనే కార్డు వినియోగ నిష్పత్తిని 30 శాతం లోపు ఉండేలా చూడండి. క్రమంగా స్కోరు బాగుపడుతుంది.
అప్పు కోసం అడిగితే..
అప్పుల సంఖ్య అధికంగా ఉంటే.. క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. చాలామంది అప్పు మొత్తం తక్కువగానే ఉన్నా.. వాటి సంఖ్య మాత్రం అధికంగా ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడూ ఏదో ఒక బ్యాంకు, యాప్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల్లో రుణాల కోసం చూస్తూ ఉంటారు. ఇలాంటి వారి రుణ నివేదికలో ఆ అంశాలు కనిపిస్తూ ఉంటాయి. చిన్న రుణాలను తీర్చేసి, ఒక పెద్ద అప్పును ఉంచుకోవడం ఎప్పుడూ మంచిది. అనవసరంగా రుణాలు కావాలని ఎవరినీ సంప్రదించకూడదు.
* చాలా ఏళ్లుగా వాడుతున్న క్రెడిట్ కార్డును రద్దు చేసుకున్నప్పుడు తాత్కాలికంగా స్కోరుపై ప్రభావం పడుతుంది. మీ రుణ అర్హత తగ్గిపోవడం, రుణ చరిత్రలో పాత కార్డుకు సంబంధించిన వివరాలు లేకపోవడం ఇందుకు కారణం అవుతుంది. కాబట్టి, మీరు తొలిసారి తీసుకున్న క్రెడిట్ కార్డును సాధ్యమైనంత వరకూ రద్దు చేసుకోవద్దు.
* పాన్, ఆధార్ కార్డులను దొంగతనంగా వాడుకొని, రుణాలు తీసుకుంటున్న సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసం ఏమైనా జరిగిందా అని తెలుసుకోవాలంటే.. క్రెడిట్ నివేదికను తరచూ పరిశీలిస్తుండాలి. మీకు సంబంధం లేని అప్పులు కనిపిస్తే వెంటనే బ్యాంకులు/రుణ సంస్థల దృష్టికి తీసుకెళ్లాలి. అప్పుడు క్రెడిట్ బ్యూరోలు వాటిని సరిదిద్దుతాయి. ఫలితంగా స్కోరు మెరుగవుతుంది.
- అధిల్ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nupur Sharma: నుపుర్ శర్మ హత్యకు కుట్ర? ఉగ్రవాది అరెస్టు
-
Movies News
Kalapuram: పవన్ కల్యాణ్ పరిచయం చేసిన ‘కళాపురం’.. ఆసక్తిగా ట్రైలర్
-
World News
కరవు కోరల్లో ఇంగ్లాండ్.. ఖాళీగా రిజర్వాయర్లు.. నీటి వాడకంపై ఆంక్షలు!
-
India News
The Great Khali: అభిమానుల చర్యకు ఏడ్చేసిన ‘ది గ్రేట్ ఖలీ’
-
Politics News
Tejashwi Yadav: నీతీశ్ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’
-
Crime News
Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు!
- Fahadh Faasil MALIK Review: రివ్యూ: మాలిక్
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!
- Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
- The Great Khali: అభిమానుల చర్యకు ఏడ్చేసిన ‘ది గ్రేట్ ఖలీ’
- Tejashwi Yadav: నీతీశ్ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’
- Taiwan issue: తైవాన్‌లో ఉద్రిక్తతలపై స్పందించిన భారత్
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Kalapuram: పవన్ కల్యాణ్ పరిచయం చేసిన ‘కళాపురం’.. ఆసక్తిగా ట్రైలర్