Updated : 05 Aug 2022 11:50 IST

Consumer Rights: నాసిరకం కుక్కర్ల విక్రయం.. అమెజాన్‌కు జరిమానా

కొనుగోలుదార్లకు డబ్బులు తిరిగి ఇవ్వమని ఆదేశం

దిల్లీ: నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్లుగా లేని ప్రెజర్‌ కుక్కర్‌లను విక్రయించినందుకు గాను అమెజాన్‌కు రూ.1 లక్ష జరిమానాను కేంద్ర వినియోగదారు పరిరక్షణ ప్రాధికారిక సంస్థ (సీసీపీఏ) విధించింది. అమెజాన్‌ ద్వారా కుక్కర్‌లను కొనుగోలు చేసిన 2,265 మంది వినియోగదారుల నుంచి వాటిని వెనక్కి తీసుకుని, వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయాలనీ ఆదేశించింది. నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న దేశీయ ప్రెజర్‌ కుక్కర్‌లను అమెజాన్‌ ప్లాట్‌ఫాంపై విక్రయించిన వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని సీసీపీఏ చర్యలను ప్రారంభించింది. దిగ్గజ ఇ-కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, షాప్‌క్లూస్‌, స్నాప్‌డీల్‌తో పాటు ఈ ప్లాట్‌ఫామ్‌లపై నమోదైన విక్రయదార్లకు కూడా నోటీసులను జారీ చేసింది. ‘కంపెనీ వివరణను పరిశీలించిన తర్వాత 2,265 ప్రెజర్‌ కుక్కర్లు నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని గుర్తించాం. ఈ కుక్కర్‌ల విక్రయం ద్వారా అమెజాన్‌కు కమీషన్‌ రుసుము రూపంలో రూ.6,14,825.41 వచ్చాయ’ని సీసీపీఏ తెలిపింది. అందువల్ల నాణ్యతా లోపం ఉన్న 2,265 కుక్కర్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ విషయాన్ని తెలియజేసి, వాటిని వెనక్కి రప్పించాలని అమెజాన్‌కు సూచించామని పేర్కొంది. నిబంధనల పాటింపునకు సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలనీ ఆదేశించింది. పేటీఎం మాల్‌కు కూడా ఇదే తరహా ఆదేశాలను, జరిమానాను సీసీపీఏ విధించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని