Finance: ఈ 4 పనులూ పూర్తి చేయండి

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఇదే సమయంలో ఆర్థిక విషయాలకు సంబంధించి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.

Updated : 22 Dec 2023 03:35 IST

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఇదే సమయంలో ఆర్థిక విషయాలకు సంబంధించి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..

  • - నామినీ పేర్లు: డీమ్యాట్‌ ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడులకు నామినీ పేరును పేర్కొన్నారా? లేకపోతే వెంటనే  ఆ పనిని పూర్తి చేయండి. డిసెంబరు 31లోగా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. నామినేషన్‌తోపాటు, మీ చిరునామా, ఫోన్‌, ఇ-మెయిల్‌ వివరాలు, బ్యాంకు ఖాతా తదితర వివరాల్లో లుంటే, వాటినీ తెలియజేయండి.
  •  - వాడని యూపీఐలు: ఏడాదికి మించి ఎలాంటి లావాదేవీలూ లేని యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ఐడీలను రద్దు చేయాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) చెల్లింపు యాప్‌లు నిర్వహించే సంస్థలు, బ్యాంకులకు సూచించింది. కాబట్టి, మీ యూపీఐ యాప్‌లు అవసరం ఉంటే వాటిని ఒక్కసారైనా వాడి, యాక్టివేట్‌ చేసుకునేందుకు ప్రయత్నించండి.
  •  - లాకర్‌ ఒప్పందం: రిజర్వు బ్యాంక్‌ సూచనల మేరకు బ్యాంకులు కొత్త లాకర్‌ ఒప్పందంపై ఖాతాదారుల సంతకాన్ని తీసుకోవాల్సి ఉంది. దీనికి గడువు తేదీ ఈ నెలాఖరుతో ముగియనుంది. కాబట్టి, వెంటనే కొత్త ఒప్పందంపై సంతకం చేసేందుకు మీ లాకర్‌ ఉన్న శాఖను సంప్రదించండి.
  • - ఆదాయపు పన్ను రిటర్నులు: 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు రిటర్నులు దాఖలు చేసేందుకు డిసెంబరు 31తో వ్యవధి ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయకపోతే వెంటనే ఆ పనిని పూర్తి చేయండి. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.1,000, అంతకు మించి ఉన్నవారికి రూ.5,000 అపరాధ రుసుము వర్తిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని