దాన లక్ష్ములు!
‘నా సంపదలో సగం దానం చేస్తా’ రెండేళ్ల క్రితం మెకంజీ స్కాట్ మాట ఇది! అన్నట్టుగానే ఏటా ఆమె దానాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు.
వీళ్లకి పంచడంలోనే ఆనందం
‘నా సంపదలో సగం దానం చేస్తా’ రెండేళ్ల క్రితం మెకంజీ స్కాట్ మాట ఇది! అన్నట్టుగానే ఏటా ఆమె దానాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు. తాజాగా రూ.954 కోట్ల వితరణతో ఇప్పటివరకూ ఆమె దానం చేసిన మొత్తం రూ.93 వేల కోట్లకు పైమాటే! సంపద నలుగురికీ పంచినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నది ఆమె ఉద్దేశం. మాదీ ఇదే మాట అంటూ దాతృత్వంలో పోటీపడుతున్న వారిలో కొందరు వీళ్లు..
ప్రపంచంలోనే మొదటి స్థానం: మిలిందా గేట్స్
మహిళల్ని, ఆడపిల్లల్ని బలోపేతం చేస్తే వాళ్ల ద్వారా కుటుంబం, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతాయని మిలిందా నమ్మకం. అందుకే వారి ఆరోగ్యం, విద్యపరంగా ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఈమెది అమెరికా. కంప్యూటర్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ, ఆపై ఎంబీఏ చేసి 1987లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. 1994లో బిల్‌గేట్స్‌ను పెళ్లాడారు. 1996లో మొదటిసారి తల్లయ్యాక సేవపైనే దృష్టిపెట్టారు. ప్రజారోగ్య కార్యక్రమాలు, ఉత్తరమెరికాలోని గ్రంథాలయాలకు సాయం, స్కాలర్ ప్రోగ్రామ్‌లు, మైనారిటీ స్టడీ ప్రోగ్రామ్‌లు నిర్వహించేవారు. 2000లో బిల్‌గేట్స్‌తో కలిసి 17 బిలియన్ డాలర్లు (రూ.1లక్షా 31వేల కోట్లు)తో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. దీనికి చాలామంది భారీ విరాళాలు ఇస్తున్నారు. ‘వేగంగా వెళ్లాలంటే ఒక్కరే వెళ్లండి. ఎక్కువ దూరం సాగాలంటే నలుగురినీ కలుపుకుంటూ వెళ్లాలి’ అంటారీవిడ. ఇప్పుడిది ప్రపంచంలోనే అతి పెద్ద సేవా సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అందరి ఆరోగ్యం, అభివృద్ధి, విద్య లక్ష్యాలుగా దీన్ని ప్రారంభించారు. దీనికి కో ఛైర్పర్సన్ మిలిందానే. బిల్‌గేట్స్‌తో విడాకులైనా సంస్థ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
దేశాభివృద్ధి లక్ష్యంగా..: నీతా అంబానీ
పుట్టింది మధ్యతరగతి కుటుంబంలో! కాబట్టి, ఆ కష్టాలు తనకు తెలుసంటారు. ముంబయికి చెందిన ఈమె కామర్స్ చదివారు. 2010లో భర్త ముఖేష్ అంబానీతో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ సమాచారం, పేదవిద్యార్థులకు స్కాలర్షిప్లు, ఆరోగ్యం, కళలు, ప్రకృతి విపత్తుల్లో సహాయచర్యలు వంటివెన్నో చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బడులు, కళాశాలల్నీ నిర్మించారు. కొవిడ్ సమయంలో ప్రపంచ దానకర్ణుల జాబితా 2020లో దేశం నుంచి నీతా ఒక్కరే స్థానం సాధించారు. ఆ సమయంలో వలస కూలీలు, పేదలు, వృద్ధులకు ‘అన్న సేవ’ పేరుతో ఆహారాన్ని అందించారు. కొవిడ్ బాధితుల సహాయార్థం, ఆసుపత్రి నిర్మాణానికి రూ.558 కోట్లకుపైగా వితరణ చేశారు.
సమాన అవకాశాలివ్వాలని: ప్రెసిల్లా చాన్
చైనా జాతీయురాలు. పుట్టిపెరిగింది అమెరికా. ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ కో ఫౌండర్, సీఈఓ. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి మెడికల్ డిగ్రీ పట్టా పొందారు. ‘ప్రైమరీ స్కూల్’ అనే ఎన్జీఓ స్థాపించి ఉచిత విద్యనందిస్తున్నారు. ఆసుపత్రులు, విద్యాలయాల అభివృద్ధికి రూ.35 వేల కోట్ల వరకూ అందించారు. మొదటి పాప పుట్టాక భర్తతో కలిసి ఫేస్బుక్లో 99 శాతం షేర్లను పేదల ఆరోగ్యం, విద్యకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వాటి విలువ 46 బిలియన్ డాలర్లు (రూ.3.5 లక్షల కోట్లకు పైనే). చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ పేరిట ఈ సేవల్ని ప్రెసిల్లానే చూసుకుంటున్నారు. అందరికీ సమానావకాశాలు వచ్చినప్పుడే అభివృద్ధి అంటారీవిడ. ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో గుండెజబ్బులను తగ్గించడంలోనూ సాయమందిస్తున్నారు.
రెండేళ్లలో రూ.93 వేల కోట్లు: మెకంజీ స్కాట్
‘మనమొక్కరమే ఎదిగితే గొప్పేముంది? అందరూ కలిసి సాగడంలోనే అభివృద్ధి, ఆనందం’ అంటారు మెకంజీ. ప్రపంచ కుబేర మహిళల్లో మూడో స్థానం. ఈమెది అమెరికా. ప్రముఖ రచయిత్రి కూడా. ఆంగ్లంలో బ్యాచిలర్స్ చేశారు. జెఫ్ బెజోస్‌తో పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి ‘అమెజాన్’ ప్రారంభించారు. వ్యాపార ప్రణాళికలు, షిప్పింగ్, కాంట్రాక్టులు వంటివన్నీ ఈవిడే చూసుకున్నారు. వ్యాపారం వృద్ధి చెందాక ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యారు. 2019లో జెఫ్ బెజోస్‌తో విడాకుల విషయాన్ని వెల్లడించినప్పుడే తన సంపదలో సగాన్ని దానం చేస్తాననీ ప్రకటించారు. జాతి సమానత్వం, వాతావరణ మార్పులు, లింగ సమానత్వం, గ్రామీణ విద్యాలయాల అభివృద్ధి, కొవిడ్ బాధితులకి.. సాయం చేస్తూ వచ్చారు. తాజాగా యువతకు దిశానిర్దేశం చేసే మెంటారింగ్ ఛారిటీ సంస్థకు రూ.954 కోట్లు వితరణగా ఇచ్చారు. రెండేళ్లలో ఆమె దానం చేసిన మొత్తం రూ.93వేల కోట్లకు పైమాటే.
25 ఏళ్ల సేవ: సుధామూర్తి
ఆడంబరాలకు దూరం. రచయిత్రిగా సుపరిచితురాలు. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. టాటా సంస్థలో ఇంజినీర్‌గా, విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గానూ పని చేశారు. 1996లో.. తన 45 ఏళ్ల వయసులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు సుధామూర్తి. రూ.35 లక్షల నగదుని చూసి.. ఇంత డబ్బును ఎవరికి దానం చేయాలనుకున్నారట. దేశంలో పర్యటించాక గానీ పేదల బాధలు తెలియలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దేశవ్యాప్తంగా గ్రంథాలయాలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్య సహకారం, గ్రామీణాభివృద్ధి, కళలు, సంస్కృతి, స్వయం ప్రతిపత్తి సాధించేలా శిక్షణ వంటి ఎన్నో కార్యక్రమాల్ని దీని ద్వారా నిర్వహిస్తున్నారు. కొవిడ్ సమయంలోనే రూ.200 కోట్లను సేవకు వినియోగించారు. ఈ ఫౌండేషన్‌కు సుధామూర్తే ఛైర్పర్సన్. గత ఏడాది ఆ పదవి నుంచి విరమించి మూర్తి ఫౌండేషన్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. సెక్స్ వర్కర్ల జీవితాలను మార్చి వాళ్లకి ఓ మార్గం చూపించడంలోనూ కృషి చేస్తున్నారీవిడ. సేవను పనిలా కాక.. పిల్లల్ని పెంచినంత బాధ్యతగా చేయాలంటారీమె. ఈ విషయంలో తనకు రతన్‌టాటానే ఆదర్శమంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీపై పన్ను పడకుండా...
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను పరిధిలో లేనప్పుడు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) పడకుండా చూసుకుంటున్నారా? ఇందుకోసం ఏం చేయాలో తెలుసా? బ్యాంకు లేదా సంస్థల దగ్గర ఫారం 15జీ లేదా 15హెచ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మూలం వద్ద పన్ను కోత విధించరు. -
జీవిత బీమా.. మీ బాధ్యతలను తీర్చేలా
మీ నెలవారీ ఆదాయం కిరాణా సామగ్రి, బిల్లులు చెల్లించడం, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులను తీర్చడంలో మీకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటుంది. మీ బడ్జెట్ ఖర్చులను పక్కన పెడితే.. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అత్యవసర ఖర్చులు, పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యలాంటి వాటి కోసం పొదుపు, మదుపు చేయాల్సిన అవసరమూ ఉంటుంది. -
బేరమాడితే తగ్గేను ప్రీమియం
కారు బీమా ఒక బాధ్యత. ఏడాదికోసారి దీన్ని పునరుద్ధరిస్తూనే ఉండాలి. అప్పుడే దీన్ని మీరు రోడ్డు మీద ఎలాంటి భయాలూ లేకుండా నడపగలరు. బీమా రక్షణ లేకుంటే.. అటు చట్టపరంగానూ, ఇటు ఆర్థికంగానూ చిక్కులు తప్పవు. -
నిఫ్టీ 50 షేర్లలో పెట్టుబడికి...
నవి మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక నిఫ్టీ 50 ఈటీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది. నవీ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ నేటితో ముగియనుంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.250. ఓపెన్ ఎండెడ్ పథకం. -
Elon Musk: బాల్యంలో కష్టాలు పడ్డా.. వదంతులకు చెక్ పెడుతూ మస్క్ పోస్ట్
Elon Musk: ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా అనేక విషయాలను పంచుకుంటుంటారు. అనేక మంది ట్వీట్లకు తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఇటీవల గనులపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సుదీర్ఘ ట్వీట్ చేశారు. -
Mukesh Ambani: ముకేశ్ అంబానీ.. 20 ఏళ్ల ఇండస్ట్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ విస్తరణలో ముకేశ్ అంబానీ కీలక పాత్ర పోషించారు. తండ్రి మరణం తర్వాత కంపెనీ బాధ్యతలు చేపట్టిన ఆయన సంస్థను అనేక రంగాలకు విస్తరించారు. -
Retirement: 50 ఏళ్లకే రిటైర్.. తర్వాత ఎలా? నితిన్ కామత్ సూచనలు
ఒకప్పటిలాగా 60 ఏళ్లు పనిచేసి, పదవీ విరమణ చేసే రోజులు కావివి. ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్యపరమైన పురోగతి కారణంగా ఆయుర్దాయం 80కి చేరింది. -
Nellore: చదువు మానేసి.. చాయ్‌తో రూ.5 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు.. ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) చదివి.. మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. -
లక్ష కోట్లకు చేర్చిన ఉక్కు మహిళ!
తక్కువమంది ఎంచుకునే రంగంలో అడుగుపెట్టడానికి సంకోచించేవారే ఎక్కువ. అమ్మాయిలను చదివించడమే గొప్పనుకునే రోజుల్లో ఆ సాహసం చేశారు సోమ మోండల్. ఓ మహిళ.. నాయకురాలన్న ఊహే కష్టమైన వేళ ఆ స్థానాన్ని అధిరోహించారు. -
Zepto: చిటికేసి... వేల కోట్లు సృష్టించిన చిన్నోళ్లు!
ఇంకా వయసు 20 దాటలేదు... చదువు పూర్తి కాలేదు....అలాంటి వారు... అప్పటికే మార్కెట్లో 20 ఏళ్ల అనుభవమున్నవారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చిన వారికి అనుమానం! ఈ కుర్రాళ్లా మా సామర్థ్యాన్ని నిర్ణయించేదని? వీళ్లా మాకు కొలువిచ్చేదని? ఆ -
Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. భారత్‌లో ఈక్విటీ మదుపర్లకు బెంచ్‌మార్క్‌గా చెప్పుకునే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. -
Savitri Jindal: ఆసియా సంపన్న మహిళ.. సావిత్రి జిందాల్
ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్‌కు చెందిన సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ ఛైర్పర్సన్ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్ -
తక్కువ నష్టానికీ వ్యూహాలు!
‘ప్రపంచమంతా అధిక ధరలతో.. ఆ ప్రభావం వల్ల ఏర్పడుతున్న మందగమనంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, మదుపర్లు.. ముఖ్యంగా తొలిసారి డబ్బులు పెడుతున్నవారు తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాల’ని స్విస్ పెట్టుబడిదారు,‘ది గ్లూమ్ బూమ్ డూమ్’ ఎడిటర్ మార్క్ ఫాబర్ సూచిస్తున్నారు. ‘అమెరికాలో వడ్డీరేట్లు అధికంగా పెంచబోరని, 6 నెలల్లో తగ్గించడం ప్రారంభం కావచ్చ’ని వార్తా సంస్థ ‘ఇన్ఫామిస్ట్’కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ.. -
Gita Gopinath: ‘గీత’లు చెరిపేస్తూ.. మరో ఘనత సాధించిన గీతా గోపీనాథ్..!
ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులై రికార్డు సృష్టించారు భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్. -
Microsoft India COO: జీవితం పిజ్జా లాంటిది.. ఆ ఐదూ ఉండాల్సిందే!
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది. -
‘యూనికార్న్’ అంటే నమ్మలేకపోయా!
మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్‌టెక్ రంగంలో మాత్రం చాలా అరుదు. -
జోడీ నెంబర్ 1
కంబైన్డ్ స్టడీతో మార్కులు కొల్లగొట్టిన విద్యార్థుల్ని చూశాం. సివిల్స్ సాధించిన భార్యాభర్తల గాథలు విన్నాం. -
ఆఫీసు బాయ్ నుంచి కోట్ల వ్యాపారం దాకా!
‘ఇది కాదు... ఇది కానే కాదు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు... నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు... అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా నా -
ఆ రోజు... చనిపోతాననుకున్నా!
గౌతమ్ అదానీ.. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీపడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు అధినేత. -
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్లో స్టార్ తిరిగింది!
స్టాక్ మార్కెట్‌కూ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకూ విడదీయలేని సంబంధం ఉంది. ఆయన ఆస్తి విలువ రూ.35వేల కోట్లు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
-
Hockey: జూనియర్ హాకీ ప్రపంచకప్.. కొరియాను ఓడించిన భారత్
-
Naga Chaitanya: ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసినా.. నటించేవాడిని: నాగ చైతన్య
-
Revanth Reddy: అధిష్ఠానానికి కృతజ్ఞతలు: రేవంత్‌రెడ్డి
-
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే లక్ష్యంగా ఈడీ దాడులు..!
-
IND vs SA: భారత్‌తో సిరీస్‌లు.. మా జట్టు రికార్డును కొనసాగిస్తాం: దక్షిణాఫ్రికా కోచ్