సిట్రోయెన్‌ కొత్త సి3

సిట్రోయెన్‌ ఇండియా తమ సరికొత్త మోడల్‌ సి3ని బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.7 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఎఫ్‌సీఏ, గ్రూపే పీఎస్‌ఏల సంయుక్త సంస్థగా ఏర్పాటైన స్టెల్లాంటిస్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థే సిట్రోయెన్‌.

Updated : 21 Jul 2022 09:11 IST

ప్రారంభ ధర రూ.5.7 లక్షలు

దిల్లీ: సిట్రోయెన్‌ ఇండియా తమ సరికొత్త మోడల్‌ సి3ని బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.7 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఎఫ్‌సీఏ, గ్రూపే పీఎస్‌ఏల సంయుక్త సంస్థగా ఏర్పాటైన స్టెల్లాంటిస్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థే సిట్రోయెన్‌. సి3తో ఈ సంస్థ సబ్‌-4 మీటర్‌ విభాగంలోకి ప్రవేశించింది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్‌తో రూపొందిన సి3 వాహనాలు రూ.5.7-8.05 లక్షల మధ్య లభ్యమవుతాయి. ఈ మోడల్‌ను కంపెనీ 2 ట్రిమ్‌లలో విడుదల చేసింది. 1.2 ప్యూర్‌టెక్‌ 82 మేటెడ్‌, 5-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, 1.2 లీటర్‌ ప్యూర్‌టెక్‌ 110 మేటెడ్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌లతో వీటిని రూపొందించారు. ‘భారత్‌లో సి3 విడుదలతో మెయిన్‌స్ట్రీమ్‌ బి-హ్యాచ్‌ విభాగంలోకి సిట్రోయెన్‌ అడుగుపెట్టింద’ని స్టెల్లాంటిస్‌ ఇండియా సీఈఓ, ఎండీ రోలాండ్‌ బౌచారా వెల్లడించారు. కంపెనీ సి-క్యూబ్డ్‌ వాహనాల్లో భారత వినియోగదార్లకు పరిచయం చేస్తున్న తొలి మోడల్‌ ఇదేనని తెలిపారు. సి3లో 90 శాతానికి పైగా విడిభాగాలు స్థానికంగానే సమీకరిస్తున్నట్లు వెల్లడించారు. చెన్నైలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం, తిరువళ్లూర్‌లో వాహన అసెంబ్లీ ప్లాంట్‌, హొసూర్‌లో పవర్‌ట్రెయిన్‌ ప్లాంట్‌ ఉన్నాయని వెల్లడించారు. బుధవారం నుంచి దేశ వ్యాప్తంగా 19 నగరాల్లో ఉన్న 20 లా మైసన్‌ సిట్రోయెన్‌ ఫిజిటల్‌ విక్రయశాలల ద్వారా సి3 డెలివరీలు ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని