విపణిలోకి టీవీఎస్‌ ‘రోనిన్‌’ మోటర్‌ సైకిల్‌

ఖరీదైన మోటర్‌ సైకిళ్ల విభాగంలోకి టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అడుగుపెట్టింది. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ‘రోనిన్‌’ మోటార్‌సైకిల్‌ను టీవీఎస్‌ మోటార్‌ ప్రీమియం వ్యాపార విభాగాధిపతి విమల్‌ సుంబ్లీ విడుదల చేశారు. మూడు వేరియంట్లలో ఈ బైక్‌ అందుబాటులో ఉంటుంది. టీ

Published : 22 Jul 2022 03:11 IST

హైదరాబాద్‌: ఖరీదైన మోటర్‌ సైకిళ్ల విభాగంలోకి టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అడుగుపెట్టింది. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ‘రోనిన్‌’ మోటార్‌సైకిల్‌ను టీవీఎస్‌ మోటార్‌ ప్రీమియం వ్యాపార విభాగాధిపతి విమల్‌ సుంబ్లీ విడుదల చేశారు. మూడు వేరియంట్లలో ఈ బైక్‌ అందుబాటులో ఉంటుంది. టీవీఎస్‌ రోనిన్‌ ఎస్‌ఎస్‌ ధర రూ.1,49,000 (ఎక్స్‌షోరూం, తెలంగాణ) కాగా.. రోనిన్‌ డీఎస్‌ రూ.1,56,600, రోనిన్‌ టీడీ రూ.1,68,750 ధరల్లో లభ్యం కానుంది. పూర్తి ఎల్‌ఈడీ ల్యాంప్స్‌, 9 స్పోక్‌ అల్లాయ్‌ వీల్స్‌, స్పీడో మీటర్‌, టి-ఆకృతి పైలట్‌ ల్యాంప్‌ లాంటి ప్రత్యేకతలతో పాటు డిజిటల్‌ క్లస్టర్‌, వాయిస్‌ అసిస్ట్‌, టర్న్‌ బై టర్న్‌ నేవిగేషన్‌, కస్టమ్‌ విండో నోటిఫికేషన్‌ లాంటి అధునాతన సాంకేతికతలు ఈ బైకుకు అమర్చినట్లు సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని