Volvo Cars: ఒకసారి ఛార్జ్‌ చేస్తే 400 కి.మీ. ప్రయాణం

వోల్వో కార్‌ ఇండియా, దేశంలో తమ తొలి విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ)  ఎక్స్‌సీ40 రీఛార్జ్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.55.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

Updated : 27 Jul 2022 07:07 IST

వోల్వో ఎక్స్‌సీ40 రీఛార్జ్‌ ఎస్‌యూవీ
ధర రూ.55.9 లక్షలు

దిల్లీ: వోల్వో కార్‌ ఇండియా, దేశంలో తమ తొలి విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ)  ఎక్స్‌సీ40 రీఛార్జ్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.55.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). భారత్‌లో (బెంగళూరు) తాము అసెంబుల్‌ చేస్తున్న తొలి విలాసవంత కారు ఇదేనని వోల్వో కార్‌ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా వెల్లడించారు. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని తెలిపారు. వోల్వో కార్‌ ఇండియా వెబ్‌సైట్‌లో నేటి (ఈనెల 7) నుంచి రూ.50,000 ముందస్తుగా చెల్లించి ఈ కారును బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా మాత్రమే వీటిని విక్రయించనుంది. 408 హెచ్‌పీ సామర్థ్యంతో దీన్ని రూపొందించారు. 2007లో భారత్‌లోకి ప్రవేశించిన వోల్వోకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22 విక్రయ కేంద్రాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని