Honda: హోండా నుంచి సీబీ300ఎఫ్‌ బైక్‌

మధ్యశ్రేణి (300-350 సీసీ) మోటార్‌ సైకిల్‌ విభాగంలో తమ నాలుగో మోడల్‌ ‘సీబీ300ఎఫ్‌’ను హోండా మోటార్స్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.25 లక్షలు. సోమవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో

Updated : 09 Aug 2022 03:17 IST

ధర రూ.2.25 లక్షల నుంచి

ఈనాడు, హైదరాబాద్‌: మధ్యశ్రేణి (300-350 సీసీ) మోటార్‌ సైకిల్‌ విభాగంలో తమ నాలుగో మోడల్‌ ‘సీబీ300ఎఫ్‌’ను హోండా మోటార్స్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.25 లక్షలు. సోమవారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ బైక్‌ను హెచ్‌ఎంఎస్‌ఐ ఎండీ, సీఈఓ అత్సుషి ఒగటా విపణిలోకి విడుదల చేశారు. 293సీసీ, 4 వాల్వ్‌ ఎస్‌ఓహెచ్‌సీ ఇంజిన్‌, 6 గేర్లు ఇందులో ఉన్నాయి. దాదాపు 10కి పైగా నూతన పేటెంట్‌ అప్లికేషన్లు ఈ బైక్‌లో ఉన్నాయి. 150 ఎంఎం వెడల్పాటి వెనుక చక్రం, సర్దుబాటు చేసుకునేందుకు వీలున్న 5 అంచెల రియర్‌ మోనో షాక్‌ సస్పెషన్‌ అమర్చారు. అత్యాధునిక స్ట్రీట్‌ ఫైటర్‌ డిజైన్‌తో దీన్ని రూపొందించినట్లు ఒగటా వెల్లడించారు. మొబైల్‌ను బ్లూటూత్‌ సాయంతో అనుసంధానించుకునే వీలుందని, నగర రహదారులు-జాతీయ రహదారుల్లో, స్టైలిష్‌ బైక్‌లపై ప్రయాణించాలన్న యువత కోసం ఈ బైక్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ప్రీమియం మోటార్‌సైకిల్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ పి.రాజగోపి తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని