స్కిప్పీ నుంచి ఫ్రీజర్‌ బైకులు

ఐస్‌ పాప్సికల్స్‌ను ఉత్పత్తి చేసే హైదరాబాద్‌ అంకురం స్కిప్పీ ఫ్రీజర్‌ విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం బైక్‌ వోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Updated : 19 Oct 2022 09:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐస్‌ పాప్సికల్స్‌ను ఉత్పత్తి చేసే హైదరాబాద్‌ అంకురం స్కిప్పీ ఫ్రీజర్‌ విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం బైక్‌ వోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీటి ద్వారా స్కిప్పీ ఉత్పత్తులను సులభంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకెళ్లేందుకు వీలవుతుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు రవి కాబ్రా తెలిపారు. ఇప్పటికే 100 బైకులకు ఆర్డర్లు వచ్చాయని, 5-6 నెలల్లో 600 బైకులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. సహజసిద్ధంగా అందుబాటులోకి తీసుకొచ్చిన తమ ఉత్పత్తులు దేశంలోని 8వేలకు పైగా రిటైల్‌ విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో 1,500 కేంద్రాల్లో లభిస్తున్నాయన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని