సరికొత్త పల్సర్‌ పీ150

ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయ డిజైన్‌తో రూపొందించిన సరికొత్త పల్సర్‌ను బజాజ్‌ ఆటో విపణిలోకి విడుదల చేసింది.

Updated : 23 Nov 2022 08:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయ డిజైన్‌తో రూపొందించిన సరికొత్త పల్సర్‌ను బజాజ్‌ ఆటో విపణిలోకి విడుదల చేసింది. 150 సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో తీసుకొచ్చిన ఈ పల్సర్‌ పీ150 పాత మోడళ్లతో పోలిస్తే దాదాపు 10 కిలోల తక్కువ బరువుతో ఉండటంతో పాటు సరికొత్త డిజైన్‌లో ఆకర్షిస్తుందని బజాజ్‌ పేర్కొంది. ఇప్పటికే 250 సీసీ, 160సీసీ పల్సర్‌లకు మంచి ఆదరణ ఉందని వెల్లడించింది. ఇందులోని 149.68 సీసీ ఇంజిన్‌ 8500 ఆర్‌పీఎం వద్ద 14.5 పీఎస్‌ శక్తిని, 6,000 ఆర్‌పీఎం వద్ద గరిష్ఠంగా 13.5 టార్కును విడుదల చేస్తుంది. నగరాల్లో ప్రయాణించేందుకు ఇది సులువుగా ఉంటుందని సంస్థ పేర్కొంది. ఒకే డిస్కు బ్రేకు (సింగిల్‌ సీట్‌), రెండు డిస్కు బ్రేకులు (స్ల్పిట్‌ సీట్‌) మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం అయిదు రంగుల్లో లభిస్తోంది. ధరల శ్రేణి రూ.1,16,755-1,19,757 (ఎక్స్‌ షోరూం, దిల్లీ)గా ఉంది. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌, మోనో షాక్‌ సస్పెన్షన్‌, బైకు ఏ గేరులో వెళ్లాలో తెలియజేయడం, యూఎస్‌బీ మొబైల్‌ ఛార్జర్‌ తదితర ప్రత్యేకతలున్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని