రూ.4.22 కోట్ల లంబోర్గిని కారు

ఇటలీకి చెందిన సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారత విపణిలోకి ‘ఉరుస్‌ పెర్‌ఫార్మనేట్‌’ మోడల్‌ను విడుదల చేసింది.

Updated : 25 Nov 2022 10:03 IST

దిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారత విపణిలోకి ‘ఉరుస్‌ పెర్‌ఫార్మనేట్‌’ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.22 కోట్లు (ఎక్స్‌షోరూం). ఈ కారు కేవలం 3.3 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. గరిష్ఠ వేగం గంటకు 306 కిలోమీటర్లు. ‘భారత్‌లో మా బ్రాండు విస్తరణకు ఉరుస్‌ కీలకం అవుతుంది. ఈ మోడల్‌ను మా వినియోగదార్లకు అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉంద’ని లంబోర్గిని ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని