Hyundai Cars: జనవరి నుంచి ధరల పెంపు: హ్యుందాయ్

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) వచ్చే నెల నుంచి తన వాహనాల  ధర పెంచనుంది. ముడిసరుకు వ్యయాలు పెరిగినందున, అందులో కొంతమొత్తాన్ని వినియోగదార్లకు బదిలీ చేసేందుకే వాహన ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.

Updated : 16 Dec 2022 09:41 IST

దిల్లీ: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) వచ్చే నెల నుంచి తన వాహనాల  ధర పెంచనుంది. ముడిసరుకు వ్యయాలు పెరిగినందున, అందులో కొంతమొత్తాన్ని వినియోగదార్లకు బదిలీ చేసేందుకే వాహన ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఏ  మోడల్‌కు ఎంతెంత  పెంచుతుందో వెల్లడించలేదు. 2023 జనవరి నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.  ఇప్పటికే మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్‌ సంస్థలు కూడా నూతన సంవత్సరం నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు