హోండా సిటీలో కొత్త వర్షన్‌ వచ్చింది

జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం హోండా భారత్‌లో ప్రతి ఏడాది కనీసం ఒక కొత్త మోడల్‌ను తీసుకురావాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ప్రీమియం ఉత్పత్తులను విడుదల చేయడం ద్వారా దేశంలో వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటోంది.

Updated : 03 Mar 2023 08:51 IST

భారత్‌లో ప్రీమియం ఉత్పత్తులు తీసుకొస్తాం
ప్రతి ఏడాది ఒక కొత్త మోడల్‌: కంపెనీ

దిల్లీ: జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం హోండా భారత్‌లో ప్రతి ఏడాది కనీసం ఒక కొత్త మోడల్‌ను తీసుకురావాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ప్రీమియం ఉత్పత్తులను విడుదల చేయడం ద్వారా దేశంలో వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటోంది. మధ్య స్థాయి సెడాన్‌-సిటీ నవీకరించిన వెర్షన్‌ను గురువారం కంపెనీ విడుదల చేసింది. రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ ధర కలిగిన పెట్రోల్‌, హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌లతో నడిచే కార్లను పరిచయం చేయడంపైనే ప్రధానంగా దృష్టి నిలిపినట్లు హోండా కార్స్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ టకుయ సుమురా వెల్లడించారు. ప్రయాణికుల వాహన విభాగంలో 40 శాతానికి పైగా విక్రయాలు రూ.10 లక్షల పైన ధర ఉన్న మోడళ్ల ద్వారానే లభిస్తోందని పేర్కొన్నారు. ఈ వాటా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అమేజ్‌, సిటీలో టాప్‌ ట్రిమ్‌లు ప్రస్తుతం మొత్తం విక్రయాల్లో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. దేశంలో రూ.260 కోట్లతో విక్రయాల నెట్‌వర్క్‌ను కంపెనీ విస్తరించాలనుకుంటోంది. దీనిపై ఇప్పటికే రూ.100 కోట్లు వెచ్చించింది. దేశీయ ప్రయాణికుల వాహన విభాగంలో హోండా వాటా 2018-19లో 5.44 శాతం వాటా ఉండగా, 2021-22 నాటికి 2.79 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో భారత్‌లో తమ ఉనికిని పెంచుకోవడంపై హోండా దృష్టి సారిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు