ఎంజీ మోటార్‌ కొత్త ఈవీ ‘కామెట్‌’

కొత్తగా తీసుకొస్తున్న తమ విద్యుత్‌ వాహనం (ఈవీ) పేరును కామెట్‌గా నిర్ణయించినట్లు ఎంజీ మోటార్‌ గురువారం వెల్లడించింది. ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్‌ ఎయిర్‌రేస్‌లో పాల్గొన్న 1934 బ్రిటిష్‌ ఎయిర్‌ప్లేన్‌ నుంచి ప్రేరణ పొంది.

Updated : 03 Mar 2023 08:51 IST

దిల్లీ: కొత్తగా తీసుకొస్తున్న తమ విద్యుత్‌ వాహనం (ఈవీ) పేరును కామెట్‌గా నిర్ణయించినట్లు ఎంజీ మోటార్‌ గురువారం వెల్లడించింది. ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్‌ ఎయిర్‌రేస్‌లో పాల్గొన్న 1934 బ్రిటిష్‌ ఎయిర్‌ప్లేన్‌ నుంచి ప్రేరణ పొంది ఈ పేరును కొత్త ఈవీకి పెట్టినట్లు సంస్థ తెలిపింది. అర్బన్‌ మొబిలిటీ(పట్టణ రవాణా) అనేది ప్రస్తుత, భవిష్యత్‌ సవాళ్లను పరిష్కరించడానికి కొత్త పరిష్కారాలు చూపేలా ఉండాలని ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ రాజీవ్‌ చాబా అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే పరిశ్రమ డిజిటల్‌ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. పెద్ద సంఖ్యలో ఆవిష్కరణలు, భవిష్యత్‌ తరాలకు తగ్గట్లు సాంకేతికతలు, స్వచ్ఛ రవాణాకు అవసరమైన ప్రత్యేక డిజైన్‌లు.. ఇలా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. మేము కూడా కామెట్‌తో మంచి భవిష్యత్‌ కోసం సరికొత్త పరిష్కారాలను సూచించనున్నామని రాజీవ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని