వాహనానికి అదనపు రక్ష

అధీకృత కేంద్రాల్లో మరమ్మతు చేయించినప్పుడు ఓన్‌ డ్యామేజీ (ఓడీ) ఇన్సూరెన్స్‌ ప్రీమియంలో రాయితీని ఈ అనుబంధ పాలసీ అందిస్తుంది.

Published : 28 Apr 2023 00:08 IST

వాహన బీమా పాలసీకి అనుబంధ పాలసీలను (యాడ్‌ ఆన్‌ కవర్‌) రాయల్‌ సుందరం జనరల్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో..

* స్మార్ట్‌ సేవ్‌: అధీకృత కేంద్రాల్లో మరమ్మతు చేయించినప్పుడు ఓన్‌ డ్యామేజీ (ఓడీ) ఇన్సూరెన్స్‌ ప్రీమియంలో రాయితీని ఈ అనుబంధ పాలసీ అందిస్తుంది. ఇది ప్రైవేటు కార్ల కోసం తీసుకొచ్చింది. అదనపు ప్రీమియం ఉండదని సంస్థ పేర్కొంది.

* రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌: దీన్ని ద్విచక్ర వాహనాలకు ప్రత్యేకంగా తీసుకొచ్చింది. 11 రకాల అత్యవసరాల్లో ఈ సేవలను వినియోగించుకునేందుకు వీలుంటుంది. విద్యుత్‌, మెకానికల్‌ లోపాలు, ప్రమాదంలో దెబ్బతినడం వల్ల బండి ఆగిపోయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

* రిటర్న్‌ టు ఇన్వాయిస్‌: ప్రమాదంలో వాహనం పూర్తిగా పాడైనప్పుడు.. మొత్తం నష్టంగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భంలో బీమా విలువ, ఇన్వాయిస్‌ విలువకు మధ్య ఉన్న తేడాను ఈ అనుబంధ పాలసీ భర్తీ చేస్తుంది. రోడ్డు ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఖర్చులు, బీమా ప్రీమియం చెల్లించే విధంగానూ దీన్ని తీసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని