విద్యుత్తు ద్విచక్ర వాహన ధరలు పెరిగాయ్‌

టీవీఎస్‌ మోటార్‌ , ఏథర్‌ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్‌ తమ విద్యుత్తు స్కూటర్ల ధరలను పెంచాయి. జూన్‌ 1 నుంచి ఫేమ్‌-2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన నేపథ్యంలో తమ ఐక్యూబ్‌ స్కూటర్‌ ధరలు వేరియంట్‌ను బట్టి రూ.17,000-22,000 వరకు పెరగనున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ తెలిపింది.

Updated : 02 Jun 2023 12:00 IST

హీరో ఎలక్ట్రిక్‌ యథాతథం

దిల్లీ: టీవీఎస్‌ మోటార్‌ , ఏథర్‌ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్‌ తమ విద్యుత్తు స్కూటర్ల ధరలను పెంచాయి. జూన్‌ 1 నుంచి ఫేమ్‌-2 పథకం కింద ప్రభుత్వం సబ్సిడీని తగ్గించిన నేపథ్యంలో తమ ఐక్యూబ్‌ స్కూటర్‌ ధరలు వేరియంట్‌ను బట్టి రూ.17,000-22,000 వరకు పెరగనున్నట్లు టీవీఎస్‌ మోటార్‌ తెలిపింది. ఐక్యూబ్‌, ఐక్యూబ్‌ ఎస్‌ ధరలు వరుసగా అంతక్రితం రూ.1,06,384; రూ.1,16,886(దిల్లీ ఎక్స్‌షోరూం)గా ఉన్నాయి.

* 450ఎక్స్‌ (ప్రొ ప్యాక్‌) ధరలు ఇకపై రూ.1,65,435 నుంచి మొదలవుతాయని ఏథర్‌ ఎనర్జీ తెలిపింది. రూ.8,000 వరకు వీటి ధర పెరిగింది.  

* ఓలా ఎస్‌1 ప్రొ రూ.1,39,999; ఎస్‌1(3కేడబ్ల్యూహెచ్‌) రూ.1,29,999; ఎస్‌1 ఎయిర్‌(3కేడబ్ల్యూహెచ్‌) ధర రూ.1,09,999గా నిర్ణయించింది. ఇప్పటివరకు అమలైన ధరలతో పోలిస్తే ఇవి రూ.15,000 వరకు అధికం.

* హీరో ఎలక్ట్రిక్‌ మాత్రం తమ ఇ-స్కూటర్‌ మోడళ్ల ధరలను పెంచడం లేదని ప్రకటించింది.

ఎందుకు పెంచాయంటే: విద్యుత్‌ స్కూటర్లకు ఒక్కో కిలోవాట్‌ అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌)కు రూ.15,000 సబ్సిడీ ఉండేది. ఈ సబ్సిడీని రూ.10,000కు పరిమితం చేశారు. ఎక్స్‌ ఫ్యాక్టరీ ధరపై ప్రోత్సాహకాలు ఇప్పటివరకు 40 శాతంగా ఉండగా.. ఇకపై అవి 15 శాతం వరకే ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు