అప్పు చేసి.. షేర్లలో వద్దు
రెండేళ్లుగా గోల్డ్ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. పెద్దగా రాబడి వస్తున్నట్లు కనిపించడం లేదు.
* రెండేళ్లుగా గోల్డ్ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. పెద్దగా రాబడి వస్తున్నట్లు కనిపించడం లేదు. వీటికి బదులుగా ఈక్విటీ ఫండ్లలో మదుపు చేస్తే లాభం అంటున్నారు. నిజమేనా? నెలకు రూ.10వేలు మదుపు చేసి, ఆరేళ్ల తర్వాత బంగారం కొనాలనేది నా ఆలోచన.
- సత్య
* కొవిడ్ తర్వాత బంగారం ధర జీవిత కాల గరిష్ఠాల నుంచి 12 నుంచి 14 శాతం వరకూ తగ్గింది. మీరు ధర అధికంగా ఉన్నప్పుడు మదుపు ప్రారంభిస్తే.. ఇప్పుడు లాభాలు తక్కువగానే ఉంటాయి. ఇంకా ఆరేళ్ల వ్యవధి ఉందంటున్నారు కాబట్టి, ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి ద్వారా మదుపు చేయండి. బంగారం కొనాలనుకున్నప్పుడు ఈ పెట్టుబడిని వెనక్కి తీసుకొని, వాడుకోండి.
* వ్యక్తిగత రుణం తీసుకొని, షేర్లలో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ పెరుగుతోంది కాబట్టి, లాభాలు బాగా వస్తాయని స్నేహితుడు సూచించాడు. ఇది మంచిదేనా? ఏం చేయాలి?
- శ్రీధర్
* స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం అంటే కనీసం 5-7 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మంచి రాబడికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు. పెట్టుబడి పెట్టిన మొత్తంతో మీకు 5-6 ఏళ్లపాటు అవసరం లేదనుకున్నప్పుడే మంచి షేర్లలో మదుపు చేయాలి. అప్పు చేసి షేర్లను కొనుగోలు చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాలి. మీకు డబ్బు అవసరమున్నప్పుడు మార్కెట్లు పతనమైతే.. నష్టాన్నీ భరించాల్సి వస్తుంది.
* మూడేళ్ల మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.20వేల వరకూ మదుపు చేయాలనేది ఆలోచన. ఇందుకోసం నా ప్రణాళిక ఎలా ఉండాలి?
- ప్రభాకర్
ముందుగా మీ అబ్బాయి భవిష్యత్ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించండి. అందుకోసం మీ పేరుపై తగినంత మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. మరో 12 ఏళ్ల తర్వాతే మీ అబ్బాయి చదువుకు డబ్బు అవసరం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మీ పెట్టుబడులు కొనసాగించండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నెలకు రూ.20వేల చొప్పున 12 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 12 శాతం రాబడితో రూ.57,91,951 అయ్యేందుకు అవకాశం ఉంది.
* ప్రైవేటు ఉద్యోగిని. నెలకు రూ.50 వేల వరకూ జీతం వస్తోంది. గతంలో రూ.25లక్షల టర్మ్ పాలసీ తీసుకున్నాను. దీన్ని ఎంత మొత్తానికి పెంచుకోవాలి? నెలకు రూ.4 వేలు రికరింగ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నాను. దీనికి ప్రత్యామ్నాయంగా సురక్షిత పెట్టుబడి పథకాలేమున్నాయి?
- పవన్
* మనకు ఉన్న బీమా రక్షణ సరిపోతుందా లేదా అనేది రెండేళ్లకోసారైనా సమీక్షించుకోవాలి. వార్షికాదాయానికి 15 రెట్ల వరకూ జీవిత బీమా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఉన బీమా మొత్తం మీకు సరిపోదు. కనీసం రూ.70 లక్షల బీమా ఉండేలా చూసుకోండి. కాబట్టి, ఇప్పుడున్న బీమాకు అదనంగా మరో రూ.45 లక్షల పాలసీని తీసుకోండి. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంచుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.4వేలను దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో మదుపు చేయండి. దీనివల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 7.1 శాతం వడ్డీ లభిస్తోంది.
* నా వయసు 64. ఇటీవలే నా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రూ.3లక్షలు వెనక్కి వచ్చాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టాలని అనుకుంటున్నాను. దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉందా?
- కృష్ణ
* నేరుగా షేర్లలో మదుపు చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నష్టభయం కాస్త అధికంగా ఉంటుంది. డెట్ ఫండ్లలో స్వల్ప నష్టభయం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డెట్ ఫండ్లు 5-6 శాతం వరకే రాబడినిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మీరు పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో మదుపు చేయొచ్చు. ప్రస్తుతం ఇందులో 7.4శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.
- తుమ్మ బాల్రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి...
నా వయసు 25. నెలకు రూ.30వేల వరకూ వేతనం వస్తోంది. ఇందులో నుంచి రూ.12వేల వరకూ కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేయాలని ఆలోచన. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి? -
బంగారంలో మదుపు చేయాలంటే...
మా అమ్మాయి వయసు 13. తన అవసరాల కోసం బంగారంలో మదుపు చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయగలం. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? -
18 శాతం రాబడి వస్తుందా?
నెలకు రూ.30 వేల వరకూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం ఆశించవచ్చు? 18 శాతం వరకూ రాబడి అందుకోవచ్చా? -
డెట్ ఫండ్లలో అధిక రాబడి వస్తుందా?
నా వయసు 28. ఇప్పటి వరకూ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? నేను చిరు వ్యాపారిని. పాలసీ తీసుకునేందుకు ఆదాయ ధ్రువీకరణలు అవసరం అవుతాయా? -
నేరుగా షేర్లలో మదుపు చేస్తే...
నెలకు రూ.7,000 చొప్పున షేర్లలో మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తాను. మంచి రాబడి వచ్చేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి -
నెలకు రూ.30వేలతో
౯ మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.30 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన మదుపు పథకాలేమున్నాయి? -
అమెరికా ఫండ్లలోనూ మదుపు
నా వయసు 44. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.10,000 వరకూ రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. నా వార్షిక వేతనం రూ.8 లక్షల వరకూ ఉంది. -
12 ఏళ్లలో రూ.70 లక్షలు..
రెండు నెలల్లో పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రూ.2లక్షల వరకూ వెనక్కి వస్తున్నాయి. వీటిని మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు డెట్ పథకాలను ఎంచుకోవచ్చా? మంచి రాబడి కోసం ఏం చేయాలి? -
యులిప్ను రద్దు చేయొచ్చా?
నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.30 వేల వరకూ చేతికి వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. -
నెలకు రూ.20వేలతో..
నాలుగేళ్ల క్రితం ఆన్లైన్లో రూ.40 లక్షల టర్మ్ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 49. మరో రూ.60 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? -
టర్మ్... యులిప్ ఏది మేలు?
నా వయసు 36. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.50లక్షల విలువైన టర్మ్ పాలసీ తీసుకోవడంతోపాటు, నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. వీటికి బదులుగా యులిప్ తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. -
విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా...
నా వయసు 45. వార్షిక వేతనం రూ.12లక్షలు. నాకు రూ.50 లక్షల ఆన్లైన్ టర్మ్ పాలసీ ఉంది. మరో రూ.50 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? మరో 13 ఏళ్ల వరకూ నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
పీఎఫ్ ఖాతా కొనసాగించాలా?
నేను రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశాను. నా పీఎఫ్ ఖాతాలో రూ.22 లక్షలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. పీఎఫ్ జమ అగిన మూడేళ్ల తర్వాత వడ్డీ చెల్లించరు కదా. -
పసిడిలో మదుపు ఎలా?
మా అమ్మాయి కోసం బంగారం జమ చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.20వేల వరకూ పెట్టుబడి పెట్టగలం. ఏం చేయాలి? -
పెట్టుబడుల వివరాలు తెలుస్తాయా?
మా అమ్మాయి వయసు 4. తన పేరుమీద వీలైనప్పుడల్లా కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. మరో 20 ఏళ్ల తర్వాత ఈ డబ్బుతో అవసరం అవుతుంది. -
టాపప్ రుణంతో మదుపు చేయొచ్చా?
నా వయసు 34. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.5,000 వరకూ రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. -
నెలకు రూ.20వేలు రావాలంటే..
జాతీయ పింఛను పథకంలో నెలకు రూ.10,000 జమ చేయాలని అనుకుంటున్నాను. -
Share Market: షేర్లలో మదుపు చేస్తే లాభమేనా?
మా అమ్మాయి వయసు ఆరేళ్లు. తన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా నెలకు రూ.10,000 వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
Q&A: 15 ఏళ్లలో ₹కోటి సమకూర్చుకోవడం ఎలా?
నాకు 14 ఏళ్ల బాబు ఉన్నాడు. భర్త ఇటీవలే ప్రమాదంలో చనిపోయారు. జీవిత బీమా పాలసీ నుంచి రూ.4 లక్షల వరకూ వచ్చాయి. -
నెలనెలా వడ్డీ వచ్చేలా..
నా వయసు 37. ప్రైవేటు ఉద్యోగిని. ఎనిమిదేళ్ల మా అమ్మాయి భవిష్యత్ అవసరాల కోసం నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
నెలకు రూ.20వేలు మదుపు చేస్తే
నెలకు రూ.20 వేల వరకూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను.
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ