ప్రమాదానికి గురయ్యా... పాలసీ ఇస్తారా?
వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నాను. నా ఈపీఎఫ్ ఖాతాలో రూ.12 లక్షల వరకూ ఉన్నాయి.
* వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నాను. నా ఈపీఎఫ్ ఖాతాలో రూ.12 లక్షల వరకూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత నెలనెలా పింఛను వచ్చేలా ఎక్కడ మదుపు చేయాలి?
- వెంకట్
* మీకు వచ్చిన పదవీ విరమణ ప్రయోజనాలు సురక్షితంగా ఉండేలా చూసుకోండి. ఈపీఎఫ్ నుంచి వెనక్కి వచ్చిన మొత్తాన్ని పోస్టాఫీసు సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీంలో జమ చేయండి. ప్రస్తుతం ఈ పథకంలో 7.4శాతం వడ్డీ ఇస్తున్నారు. నెలనెలా కాకుండా.. మూడు నెలలకోసారి వడ్డీ అందుతుంది. అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించవచ్చు. కావాలనుకుంటే మరో మూడేళ్ల వ్యవధిని పెంచుకోవచ్చు. రూ.12 లక్షలను జమ చేస్తే మూడు నెలలకోసారి రూ.22,200 వడ్డీ వస్తుంది.
* మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. అతని పేరుమీద ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకు వీలుందా? దీనికోసం ఎలాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది?
- ఆదిరెడ్డి
* మీ అబ్బాయి ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకు వీలుంది. కానీ, కొన్ని కంపెనీలు మాత్రమే అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐల పెట్టుబడికి అంగీకరిస్తున్నాయి. ముందుగా కేవైసీ నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ బ్యాంకు ఖాతా ద్వారా పెట్టుబడులు ప్రారంభించాలి. అనుమతి ఇస్తున్న సంస్థల వివరాల కోసం డీమ్యాట్ ఖాతా ఉన్న స్టాక్ బ్రోకర్‌ను సంప్రదించండి.
* మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.15 వేల వరకూ బంగారంలో మదుపు చేయాలని అనుకుంటున్నాం. కనీసం 10 ఏళ్లపాటు దీన్ని కొనసాగిస్తాం. మా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి?
- రాము
* మీ అమ్మాయి భవిష్యత్ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు మీ పేరుపై తగిన మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకోండి. మొత్తం పెట్టుబడిని బంగారంలో మదుపు చేయడం సరికాదు. మీరు రూ.3వేల వరకూ పసిడి బాండ్లలో పెట్టుబడి పెట్టండి. మిగతా మొత్తాన్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు కేటాయించండి. ఇలా చేయడం ద్వారా 10 ఏళ్లలో 11 శాతం రాబడితో రూ.30,09,961 జమ అయ్యేందుకు అవకాశం ఉంది.
* టర్మ్ పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. నా వయసు 39 ఏళ్లు. నెలకు రూ.60 వేలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం ప్రమాదానికి గురయ్యాను. ఇప్పుడు కోలుకున్నాను. నేను పాలసీ తీసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయా?
- భాస్కర్
* మీరు కనీసం రూ.70 లక్షల వరకూ టర్మ్ పాలసీ తీసుకోవాలి. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీలను ఎంచుకొని, రూ.35 లక్షల చొప్పున పాలసీలు తీసుకోండి. దరఖాస్తు పత్రంలో మీకు జరిగిన ప్రమాదం వివరాలు కచ్చితంగా తెలియజేయండి. చికిత్సకు సంబంధించిన పత్రాలనూ సమర్పించాలి. అవసరమైతే ఆరోగ్య పరీక్షలకూ సిద్ధంగా ఉండాలి. వీటన్నింటినీ పరిశీలించాక బీమా కంపెనీ విచక్షణ మేరకు పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది.
- తుమ్మ బాల్‌రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
సొంత పాలసీ తీసుకోవాలా?
ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్ అవసరాల కోసం నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచిస్తున్నాం. ఇందుకోసం ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి...
నా వయసు 25. నెలకు రూ.30వేల వరకూ వేతనం వస్తోంది. ఇందులో నుంచి రూ.12వేల వరకూ కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేయాలని ఆలోచన. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి? -
బంగారంలో మదుపు చేయాలంటే...
మా అమ్మాయి వయసు 13. తన అవసరాల కోసం బంగారంలో మదుపు చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయగలం. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? -
18 శాతం రాబడి వస్తుందా?
నెలకు రూ.30 వేల వరకూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం ఆశించవచ్చు? 18 శాతం వరకూ రాబడి అందుకోవచ్చా? -
డెట్ ఫండ్లలో అధిక రాబడి వస్తుందా?
నా వయసు 28. ఇప్పటి వరకూ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? నేను చిరు వ్యాపారిని. పాలసీ తీసుకునేందుకు ఆదాయ ధ్రువీకరణలు అవసరం అవుతాయా? -
నేరుగా షేర్లలో మదుపు చేస్తే...
నెలకు రూ.7,000 చొప్పున షేర్లలో మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తాను. మంచి రాబడి వచ్చేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి -
నెలకు రూ.30వేలతో
౯ మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.30 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన మదుపు పథకాలేమున్నాయి? -
అమెరికా ఫండ్లలోనూ మదుపు
నా వయసు 44. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.10,000 వరకూ రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. నా వార్షిక వేతనం రూ.8 లక్షల వరకూ ఉంది. -
12 ఏళ్లలో రూ.70 లక్షలు..
రెండు నెలల్లో పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రూ.2లక్షల వరకూ వెనక్కి వస్తున్నాయి. వీటిని మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు డెట్ పథకాలను ఎంచుకోవచ్చా? మంచి రాబడి కోసం ఏం చేయాలి? -
యులిప్‌ను రద్దు చేయొచ్చా?
నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.30 వేల వరకూ చేతికి వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. -
నెలకు రూ.20వేలతో..
నాలుగేళ్ల క్రితం ఆన్లైన్లో రూ.40 లక్షల టర్మ్ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 49. మరో రూ.60 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? -
టర్మ్... యులిప్ ఏది మేలు?
నా వయసు 36. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.50లక్షల విలువైన టర్మ్ పాలసీ తీసుకోవడంతోపాటు, నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. వీటికి బదులుగా యులిప్ తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. -
విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా...
నా వయసు 45. వార్షిక వేతనం రూ.12లక్షలు. నాకు రూ.50 లక్షల ఆన్లైన్ టర్మ్ పాలసీ ఉంది. మరో రూ.50 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? మరో 13 ఏళ్ల వరకూ నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
పీఎఫ్ ఖాతా కొనసాగించాలా?
నేను రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశాను. నా పీఎఫ్ ఖాతాలో రూ.22 లక్షలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. పీఎఫ్ జమ అగిన మూడేళ్ల తర్వాత వడ్డీ చెల్లించరు కదా. -
పసిడిలో మదుపు ఎలా?
మా అమ్మాయి కోసం బంగారం జమ చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.20వేల వరకూ పెట్టుబడి పెట్టగలం. ఏం చేయాలి? -
పెట్టుబడుల వివరాలు తెలుస్తాయా?
మా అమ్మాయి వయసు 4. తన పేరుమీద వీలైనప్పుడల్లా కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. మరో 20 ఏళ్ల తర్వాత ఈ డబ్బుతో అవసరం అవుతుంది. -
టాపప్ రుణంతో మదుపు చేయొచ్చా?
నా వయసు 34. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.5,000 వరకూ రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. -
నెలకు రూ.20వేలు రావాలంటే..
జాతీయ పింఛను పథకంలో నెలకు రూ.10,000 జమ చేయాలని అనుకుంటున్నాను. -
Share Market: షేర్లలో మదుపు చేస్తే లాభమేనా?
మా అమ్మాయి వయసు ఆరేళ్లు. తన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా నెలకు రూ.10,000 వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
Q&A: 15 ఏళ్లలో ₹కోటి సమకూర్చుకోవడం ఎలా?
నాకు 14 ఏళ్ల బాబు ఉన్నాడు. భర్త ఇటీవలే ప్రమాదంలో చనిపోయారు. జీవిత బీమా పాలసీ నుంచి రూ.4 లక్షల వరకూ వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని