మధుమేహం ఉంది.. పాలసీ ఇస్తారా?
నేను రూ.50 లక్షల విలువైన జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. రెండు నెలల క్రితం మధుమేహం వచ్చింది
నేను రూ.50 లక్షల విలువైన జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. రెండు నెలల క్రితం మధుమేహం వచ్చింది. ఆన్లైన్లో పాలసీ తీసుకునేటప్పుడు ఆ వివరాలు చెప్పాల్సి ఉంటుందా? - మహిపాల్
* జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన అన్ని వ్యక్తిగత, ఆరోగ్య, ఆర్థిక వివరాలను కచ్చితంగా ప్రతిపాదన పత్రంలో తెలియజేయాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో దాపరికం పనికిరాదు. ఇప్పటికే మీకున్న వ్యాధులు, జరిగిన శస్త్రచికిత్సల వివరాలు పేర్కొనాలి. ఈ విషయాలు తెలియజేయకుండా.. మీరు పాలసీ తీసుకుంటే.. క్లెయిం వచ్చినప్పుడు తిరస్కరించే ఆస్కారం ఉంది. మీకు మధుమేహం ఉన్న విషయం ప్రతిపాదన పత్రంలో చెప్పండి. ఆరోగ్య పరీక్షలు అవసరమైతే చేయించుకోండి. మీ వైద్య నివేదికలకు అనుగుణంగా జీవిత బీమా సంస్థ నిర్ణయం తీసుకుంటుంది. కొన్నిసార్లు ప్రీమియం కాస్త అధికంగా వసూలు చేయొచ్చు.
మా అమ్మ వయసు 63 ఏళ్లు. తనకు నెలకు పింఛనులా కొంత ఆదాయం వచ్చేలా రూ.8లక్షలను పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఫిక్స్డ్ డిపాజిట్లలో పెద్దగా వడ్డీ రావడం లేదు కదా.. ప్రత్యామ్నాయంగా ఏ పథకాన్ని ఎంచుకోవాలి? - మధు
* ప్రస్తుతం వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్న మాట నిజమే. వీటిల్లో 5-6 శాతం వరకూ వడ్డీ లభిస్తోంది. మీ డబ్బు సురక్షితంగా ఉంటూ.. మంచి రాబడి రావాలంటే మీరు పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో 7.4శాతం వడ్డీ ఇస్తున్నారు. అయితే, నెలకు కాకుండా.. మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు. అయిదేళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించవచ్చు. రూ.8లక్షలు డిపాజిట్ చేస్తే.. మూడు నెలలకోసారి రూ.14,800 వడ్డీ వస్తుంది.
నేను మూడేళ్ల క్రితం ఇల్లు కొన్నాను. ఇంకా రూ.8లక్షల వరకూ చెల్లించాలి. ఇప్పుడు ఉద్యోగం మానేశాను. ఈఎంఐ చెల్లించగలను. రూ.8 లక్షలను ఒకేసారి చెల్లించి, రుణం తీర్చేయాలా? లేక ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తే మంచిదా? - పద్మావతి
* మీరు ఉద్యోగం చేయడం లేదు కాబట్టి, ఈఎంఐ ద్వారా రుణం చెల్లించినా ఆదాయపు పన్ను మినహాయింపులేమీ వర్తించవు. రుణానికి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, మీ దగ్గరున్న రూ.8లక్షలతో గృహరుణం తీర్చేయండి. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసినప్పుడు.. మీరు గృహరుణానికి చెల్లించే వడ్డీకి మించి రావచ్చు. లేకపోవచ్చు. పైగా నష్టభయమూ ఉంటుంది. మీకు నెలనెలా ఏదైనా ఆదాయం ఉంటే.. అప్పుడు మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేసేందుకు ప్రయత్నించండి.
నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.10 వేల వరకూ మదుపు చేయాలనేది నా ఆలోచన. నా వయసు 23 ఏళ్లు. మరో 6 ఏళ్ల వరకూ నా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది. - శశాంక్
* ముందుగా మీపైన ఆధారపడిన వారు ఉంటే.. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ జీవిత బీమా తీసుకోండి. దీంతోపాటు.. ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలూ ఎంచుకోండి. ఆరు నెలల ఖర్చుకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా ఉంచుకోండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.10వేలలో రూ.7,000 డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా రూ.3,000 బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేసుకోండి.
మా అబ్బాయిల వయసు 14, 12 ఏళ్లు. ఇద్దరి పేరుమీదా నెలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. దీనికోసం నేను ఏం చేయాలి? - సత్యం
* మీ అబ్బాయిల ఉన్నత చదువుల కోసం ఈ మొత్తం ఉపయోగపడాలనేది మీ ఆలోచనగా తెలుస్తోంది. కాబట్టి, కాస్త అధిక రాబడి వచ్చే చోట మదుపు చేయాలి. దీనికోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. కనీసం ఏడేళ్లపాటు నెలకు రూ.10వేలు మదుపు చేస్తే.. 12 శాతం రాబడితో.. రూ.12,10,681 అయ్యేందుకు అవకాశం ఉంది. కానీ, ఈ డబ్బు ఇద్దరి చదువుల ఖర్చుకు సరిపోకపోవచ్చు. వీలైతే పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోండి.
- తుమ్మ బాల్రాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి...
నా వయసు 25. నెలకు రూ.30వేల వరకూ వేతనం వస్తోంది. ఇందులో నుంచి రూ.12వేల వరకూ కనీసం 15 ఏళ్లపాటు మదుపు చేయాలని ఆలోచన. నా ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి? -
బంగారంలో మదుపు చేయాలంటే...
మా అమ్మాయి వయసు 13. తన అవసరాల కోసం బంగారంలో మదుపు చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయగలం. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? -
18 శాతం రాబడి వస్తుందా?
నెలకు రూ.30 వేల వరకూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం 12 ఏళ్లపాటు మదుపు చేస్తే ఎంత మొత్తం ఆశించవచ్చు? 18 శాతం వరకూ రాబడి అందుకోవచ్చా? -
డెట్ ఫండ్లలో అధిక రాబడి వస్తుందా?
నా వయసు 28. ఇప్పటి వరకూ ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? నేను చిరు వ్యాపారిని. పాలసీ తీసుకునేందుకు ఆదాయ ధ్రువీకరణలు అవసరం అవుతాయా? -
నేరుగా షేర్లలో మదుపు చేస్తే...
నెలకు రూ.7,000 చొప్పున షేర్లలో మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తాను. మంచి రాబడి వచ్చేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి -
నెలకు రూ.30వేలతో
౯ మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.30 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. 10 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టేందుకు అనువైన మదుపు పథకాలేమున్నాయి? -
అమెరికా ఫండ్లలోనూ మదుపు
నా వయసు 44. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.10,000 వరకూ రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. నా వార్షిక వేతనం రూ.8 లక్షల వరకూ ఉంది. -
12 ఏళ్లలో రూ.70 లక్షలు..
రెండు నెలల్లో పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రూ.2లక్షల వరకూ వెనక్కి వస్తున్నాయి. వీటిని మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు డెట్ పథకాలను ఎంచుకోవచ్చా? మంచి రాబడి కోసం ఏం చేయాలి? -
యులిప్ను రద్దు చేయొచ్చా?
నా వయసు 23. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.30 వేల వరకూ చేతికి వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.10వేలు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. -
నెలకు రూ.20వేలతో..
నాలుగేళ్ల క్రితం ఆన్లైన్లో రూ.40 లక్షల టర్మ్ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 49. మరో రూ.60 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? -
టర్మ్... యులిప్ ఏది మేలు?
నా వయసు 36. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలు తీసుకోలేదు. రూ.50లక్షల విలువైన టర్మ్ పాలసీ తీసుకోవడంతోపాటు, నెలకు రూ.10వేల వరకూ మదుపు చేయాలని ఆలోచన. వీటికి బదులుగా యులిప్ తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. -
విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా...
నా వయసు 45. వార్షిక వేతనం రూ.12లక్షలు. నాకు రూ.50 లక్షల ఆన్లైన్ టర్మ్ పాలసీ ఉంది. మరో రూ.50 లక్షల వరకూ పాలసీ తీసుకోవచ్చా? మరో 13 ఏళ్ల వరకూ నెలకు రూ.15వేల వరకూ మదుపు చేయాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
పీఎఫ్ ఖాతా కొనసాగించాలా?
నేను రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేశాను. నా పీఎఫ్ ఖాతాలో రూ.22 లక్షలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. పీఎఫ్ జమ అగిన మూడేళ్ల తర్వాత వడ్డీ చెల్లించరు కదా. -
పసిడిలో మదుపు ఎలా?
మా అమ్మాయి కోసం బంగారం జమ చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.20వేల వరకూ పెట్టుబడి పెట్టగలం. ఏం చేయాలి? -
పెట్టుబడుల వివరాలు తెలుస్తాయా?
మా అమ్మాయి వయసు 4. తన పేరుమీద వీలైనప్పుడల్లా కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. మరో 20 ఏళ్ల తర్వాత ఈ డబ్బుతో అవసరం అవుతుంది. -
టాపప్ రుణంతో మదుపు చేయొచ్చా?
నా వయసు 34. ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీలూ లేవు. నెలకు రూ.5,000 వరకూ రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. -
నెలకు రూ.20వేలు రావాలంటే..
జాతీయ పింఛను పథకంలో నెలకు రూ.10,000 జమ చేయాలని అనుకుంటున్నాను. -
Share Market: షేర్లలో మదుపు చేస్తే లాభమేనా?
మా అమ్మాయి వయసు ఆరేళ్లు. తన భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా నెలకు రూ.10,000 వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
Q&A: 15 ఏళ్లలో ₹కోటి సమకూర్చుకోవడం ఎలా?
నాకు 14 ఏళ్ల బాబు ఉన్నాడు. భర్త ఇటీవలే ప్రమాదంలో చనిపోయారు. జీవిత బీమా పాలసీ నుంచి రూ.4 లక్షల వరకూ వచ్చాయి. -
నెలనెలా వడ్డీ వచ్చేలా..
నా వయసు 37. ప్రైవేటు ఉద్యోగిని. ఎనిమిదేళ్ల మా అమ్మాయి భవిష్యత్ అవసరాల కోసం నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
నెలకు రూ.20వేలు మదుపు చేస్తే
నెలకు రూ.20 వేల వరకూ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను.
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత