పన్ను ఆదాకు మార్గాలివీ..

నేను ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద ఈపీఎఫ్‌ పోను

Published : 30 Jun 2022 15:09 IST

నేను ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద ఈపీఎఫ్‌ పోను ఇంకా రూ.1,10,000 వరకూ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు కోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

- మణి

మీరు పన్ను మినహాయింపు కోసం.. సెక్షన్‌ 80సీ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మదుపు చేయొచ్చు. మీరు రూ.40వేలను ఈపీఎఫ్‌లో జమ చేస్తున్నారు. మిగిలిన రూ.1,10,000 నుంచి రూ.35 వేలను పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)లో పెట్టుబడి పెట్టండి. మిగతా రూ. 75,000 ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో మదుపు చేయొచ్చు. వీటిల్లో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చేందుకు అవకాశం ఉంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో అతి తక్కువ లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఇందులో కనీసం మూడేళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీ పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి మదుపు చేసినా.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచే.. క్రమానుగత పెట్టుబడి విధానాన్ని ఎంచుకోండి. నెలకు రూ.6,250 చొప్పున పెట్టుబడి పెట్టండి.


* మా బాబు వయసు 14 ఏళ్లు. మరో ఆరేళ్ల తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.25,000 వరకూ మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఏం చేయాలి?

- వెంకట్‌

ముందుగా మీ బాబు భవిష్యత్‌ అవసరాలకు రక్షణ కల్పించేందుకు మీపైన తగిన మొత్తానికి టర్మ్‌ బీమా పాలసీ తీసుకోండి. మీరు మదుపు చేయాదలనుకుంటున్న మొత్తం నుంచి విద్యా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి వచ్చేలా చూసుకోవాలి. దీనికోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేయండి. ఆరేళ్లపాటు నెలకు రూ.25,000 పెట్టుబడి పెడితే.. దాదాపు రూ.25లక్షల వరకూ జమ అయ్యే అవకాశం ఉంది.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని