Q-A: ఈపీఎఫ్ ఖాతాలో పుట్టిన తేదీ వివరాలను ఎలా మార్చుకోవాలి?

ఆధార్ ప్రకారం వివరాలను ఎంటర్‌చేయాలి. అప్పుడు యూఐడీఏఐ-ఆధార్ వివరాలను పోల్చి చూస్తుంది.

Updated : 21 Jul 2022 14:09 IST

ఈపీఎఫ్ ఖాతాలో పుట్టిన తేదీ వివరాలను ఎలా మార్చుకోవాలి?

                                                            - అర్జున్ శ్రీవాస్తవ్

  • ఆన్‌లైన్‌లో సులువుగా ఉద్యోగి తన పుట్టిన తేదీ వివరాలను మార్చుకోవచ్చు
  • ముందు ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్ అవ్వాలి.
  • Manage>Modify Basic Detailsపై క్లిక్ చేయాలి.
  • ఆధార్ ప్రకారం వివరాలను ఎంటర్‌చేయాలి. అప్పుడు యూఐడీఏఐ-ఆధార్ వివరాలను పోల్చి చూపిస్తుంది.
  • ఆ తర్వాత ప్రీవియస్ స్క్రీన్లో Update Detailsపై క్లిక్ చేయాలి. ఈ రిక్వెస్ట్ మీ సంస్థకు చేరుతుంది.
  • ఉద్యోగి కోరిన మార్పులకు సంబంధించిన వివరాలను సంస్థ పరిశీలిస్తుంది.
  • సంస్థ మీ అభ్యర్థనను ఆమోదించిన తర్వాత ఈపీఎఫ్ఓ పోర్టల్‌కు ట్రాన్స్‌ఫ‌ర్‌ అవుతుంది.
  • ఆ తర్వాత సెక్షన్ సూపర్‌వైజర్‌ ఆ వివరాలను పరిశీలించి రీజనల్ ప్రావిడెంట్ కమిషనర్ (ఆర్‌పీఎఫ్‌సీ)కి పంపుతారు.
  • ఆర్‌పీఎఫ్‌సీ ఈ అభ్యర్థనను పరిశీలించి ఈపీఎఫ్ఓ వివరాల్లో మార్పులు చేయడమో లేదా ఏదైనా తప్పులు ఉంటే తిరిస్కరించడమో చేస్తారు.

ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని పీపీఎఫ్ ఖాతాలు ఉండొచ్చు? ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఏమౌతుంది?

                                                                                                  - హేమంత్ కుమార్

ఒక వ్యక్తి పేరుతో కేవలం ఒకే పీపీఎఫ్ ఖాతా ఉండాలి. అయితే మైనర్ పేరుతో మరొక ఖాతాను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున రెండో ఖాతాను తెరిచి ఉంటే.. రెండు ఖాతాలను ఒకేదానిలో విలీనం చేయాలి. అప్పుడు రెండో ఖాతాలో ఉన్న డిపాజిట్లు, వడ్డీపై నష్టం వాటిల్లదు. దీనికోసం ఆర్థిక వ్యవహారాల శాఖకు Under Secretary-NS Branch MOF (DEA), New Delhi-1 లేఖను పంపాలి. రెండు ఖాతాలకు సంబంధించిన అన్ని వివరాలను పోస్ట్ ద్వారా తెలియజేయాలి. రెండు ఖాతాల్లో కలిసి ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ పరిమితి రూ.1.50 లక్షల కంటే ఎక్కువగా డిపాజిట్ చేస్తే ఆ మిగతా మొత్తం వడ్డీ లేకుండా మీకు రీఫండ్ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు