Stock Market Course: స్టాక్‌ ఎక్స్చేంజిలో చేరేదెలా?

బాంబే స్టాక్‌ ఎక్స్చేంజిలో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్టుగా పనిచేయాలనుంది. ఏ కోర్సు చదవాలో చెబుతారా?

Updated : 21 Jul 2022 08:43 IST

బాంబే స్టాక్‌ ఎక్స్చేంజిలో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్టుగా పనిచేయాలనుంది. ఏ కోర్సు చదవాలో చెబుతారా?

- వంశీ గంగా  

డిగ్రీ స్థాయిలో బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి ఇన్‌స్టిట్యూట్‌ వారు అందించే బీఎమ్మెస్‌ ఇన్‌ కాపిటల్‌ మార్కెట్స్‌, బీబీఏ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీబీఏ ఇన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ అనలిటిక్స్‌, బీబీఎ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనలిటిక్స్‌, బీఎస్సీ ఇన్‌ డేటా సైన్సెస్‌, బాచిలర్స్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌, బీబీఏ ఇన్‌ కాపిటల్‌ మార్కెట్స్‌ లాంటి కోర్సుల్లో మీకు నచ్చిన డిగ్రీ చేసి బాంబే స్టాక్‌ ఎక్స్చేంజిలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.
ఒకవేళ మీరు డిగ్రీ పూర్తి చేసివుంటే బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి ఇన్‌స్ట్టిట్యూట్‌ అందించే పీజీ డిప్లొమా ఇన్‌ గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌, పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌ డేటా అనలిటిక్స్‌ అండ్‌ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌, పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌ ఫైనాన్సియల్‌ టెక్నాలజీ, పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ, పీజీ డిప్లొమా ఇన్‌ ప్రెడిక్టివ్‌ అనలిటిక్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ డేటాసైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ కాపిటల్‌ మార్కెట్స్‌ లాంటి వాటిలో మీకు ఆసక్తి ఉన్న కోర్సు చదవండి. మీరు ఏదైనా ఉద్యోగంలో ఉంటే, బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి ఇన్‌స్టిట్యూట్‌ అందించే వివిధ ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లను చేయడం ద్వారా బాంబే స్టాక్‌ ఎక్స్చేంజిలో పనిచేయాలనే మీ కోరికను నెరవేర్చుకోండి. ఇవే కాకుండా బాంబే ఎక్స్చేంజి ఇన్‌స్ట్టిట్యూట్‌వివిధ సర్టిఫికెట్‌ కోర్సులూ, అంతర్జాతీయ పీజీ కోర్సులనూ అందిస్తోంది.

- ప్రొ. బెల్లకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని