బీమా ప్రీమియం.. ఆ డబ్బు వెనక్కి రాదా?
మీకు 12 శాతం రాబడి అందాలంటే నష్టభయం ఉన్న పథకాలతోనే సాధ్యం. దీనికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను పరిశీలించవచ్చు.
స్థలం అమ్మగా రూ.8 లక్షలు వచ్చాయి. వీటిని గృహరుణం తీర్చేందుకు వినియోగించాలా? కనీసం 12 శాతం రాబడి వచ్చేలా మదుపు చేయాలంటే ఎలాంటి పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి?
- శ్రీకాంత్
మీకు 12 శాతం రాబడి అందాలంటే నష్టభయం ఉన్న పథకాలతోనే సాధ్యం. దీనికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను పరిశీలించవచ్చు. స్వల్పకాలంలో వీటిలో అధిక నష్టభయం ఉంటుంది. కనీసం 5-7 ఏళ్ల పాటు మీకు డబ్బుతో అవసరం లేకుంటేనే ఈ పథకాలను ఎంచుకోవాలి. ముందుగా మీ దగ్గరున్న మొత్తాన్ని లిక్విడ్ ఫండ్లలోకి మార్చుకోండి. ఆ తర్వాత మంచి ఈక్విటీ పథకాలను ఎంచుకొని, ఏడాది పాటు ఈక్విటీ ఫండ్లలోకి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా డబ్బును బదిలీ చేయాలి. ఒకేసారి పెట్టుబడి పెడితే వచ్చే హెచ్చుతగ్గులను తగ్గించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఏడేళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే.. సగటున 12 శాతం వార్షిక రాబడి అంచనాతో రూ.17,68,545 అయ్యేందుకు అవకాశం ఉంది.
ఏడాది వయసున్న మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టాలన్నది ఆలోచన. నేను వ్యాపారిని. నాకు రూ.50లక్షల జీవిత బీమా పాలసీ ఇస్తారా?
- అరుణ్
మీ పాప చదువు, మీ కుటుంబ ఆర్థిక అవసరాలకు సరైన భద్రత కల్పించేందుకు ప్రయత్నించండి. దీనికోసం మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. మీ ఆదాయానికి ఆధారంగా ఐటీ రిటర్నులు ఉపయోగపడతాయి. బీమా సంస్థ కనీసం మూడేళ్ల ఐటీ రిటర్నులను అడిగే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా మీరు రిటర్నులు దాఖలు చేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. వీటిని పరిశీలించిన తర్వాత కంపెనీ విచక్షణ మేరకు ఎంత పాలసీ వస్తుందనేది తెలుస్తుంది. చెల్లింపుల చరిత్ర బాగున్న సంస్థ నుంచి పాలసీని ఎంచుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.10వేలను హైబ్రీడ్ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసుకోండి. కనీసం మూడు నెలల సిప్ మొత్తం ఖాతాలో ఉండేలా జాగ్రత తీసుకోండి. నెలకు రూ.10వేల చొప్పున 18 ఏళ్లపాటు మదుపు చేస్తే 11 శాతం సగటు రాబడి అంచనాతో రూ.60,47,512 అయ్యేందుకు అవకాశం ఉంది.
ఆరేళ్ల క్రితం జీవిత బీమా పాలసీ తీసుకున్నాను. ఏడాదికి రూ.60వేల ప్రీమియం చెల్లించాలి. ఇప్పుడు దీన్ని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారు. నేను చెల్లించిన మొత్తంకన్నా తక్కువే వస్తుంది అంటున్నారు? నిజమేనా? మొత్తం డబ్బు రావాలంటే ఏం చేయాలి?
- కృష్ణ
మీరు తీసుకున్నది ఏ పాలసీ అన్నది ఇక్కడ ప్రధానం. ఎండోమెంట్, మనీ బ్యాక్ తరహా పాలసీలైతే.. ఆరేళ్ల తర్వాత మీరు చెల్లించిన ప్రీమియంలో 70-80 శాతం వరకూ వెనక్కి రావచ్చు. బీమా సంస్థ శాఖను లేదా సహాయ కేంద్రాన్ని సంప్రదించి, స్వాధీన విలువ (సరెండర్ వ్యాల్యూ) ఎంత వస్తుందో స్పష్టంగా తెలుసుకోండి. పాలసీని మధ్యలోనే రద్దు చేసుకున్నప్పుడు మొత్తం డబ్బు వెనక్కి వచ్చే అవకాశాలు తక్కువ.
నా వయసు 59. ఇటీవలే పదవీ విరమణ చేశాను. నెలకు రూ.10వేల వరకూ వడ్డీ వచ్చేలా మంచి పథకంలో మదుపు చేయాలనుకుంటున్నాను. దీనికోసం నేను ఎంత కేటాయించాల్సి ఉంటుంది? సురక్షిత పథకాలను సూచించండి?
- ప్రసాద్
మీకు నెలకు రూ.10వేల వడ్డీ రావాలంటే.. కనీసం 7.5 శాతం సగటు రాబడి వచ్చేలా చూసుకోవాలి. మీరు కనీసం రూ.16 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో 7.6 శాతం రాబడివస్తోంది. ఇందులో మీరు రూ.15 లక్షల వరకూ మదుపు చేసుకోవచ్చు. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. మీరు రూ.15లక్షలు జమ చేస్తే.. మూడు నెలలకోసారి రూ.28,500 చేతికి వస్తాయి. అంటే, నెలకు రూ.9,500. మిగతా రూ.లక్షను బ్యాంకులో నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి.
- తుమ్మ బాల్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Team India: దిగ్గజాల వారసత్వాన్ని కొత్తవారు కొనసాగించడం కష్టమే: పద్మశ్రీ గురుచరణ్ సింగ్
-
India News
Vande Bharat Express: అన్ని హంగులున్న ‘వందే భారత్’లో చెత్తా చెదారం
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరు
-
Movies News
Naga Vamsi: ‘ఈ పాప బుట్టబొమ్మలా లేదా?’ విలేకరికి నిర్మాత కౌంటర్
-
Sports News
IND vs NZ: మీకిష్టమైన బిర్యానీ దొరకలేదని.. ఇక రెస్టారంట్‌కు వెళ్లకుండా ఉంటారా..?: వాషింగ్టన్
-
General News
Taraka Ratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి: వైద్యులు