META: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో టిక్ కోసం నెలవారీ చందా: మెటా
వినియోగదారుల కోసం ‘మెటా వెరిఫైడ్’ పేరుతో చెల్లింపు ధ్రువీకరణ సేవలను ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. ట్విటర్ బ్లూటిక్ మాదిరిగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు కలిపి ధ్రువీకరణ గుర్తింపు కోసం నెలవారీ చందా చెల్లించాల్సి ఉంటుంది.
దిల్లీ: వినియోగదారుల కోసం ‘మెటా వెరిఫైడ్’ పేరుతో చెల్లింపు ధ్రువీకరణ సేవలను ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. ట్విటర్ బ్లూటిక్ మాదిరిగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు కలిపి ధ్రువీకరణ గుర్తింపు కోసం నెలవారీ చందా చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ధ్రువీకరణ ప్రకారమే ఖాతాకు బ్లూబ్యాడ్జ్ కేటాయిస్తారు. 2022లో అంతర్జాతీయ మాంద్యం, యాపిల్ ఐఓఎస్ గోప్యతా విధానం మార్పుల కారణంగా ప్రకటనల రాబడి తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయాలు పెంచుకోవాలని మెటా చూస్తోంది. ఈ ధ్రువీకరణ సేవల కోసం నెలకు వెబ్‌పై 11.99 డాలర్లు, ఐఓఎస్‌పై 14.99 డాలర్లు వసూలు చేయనున్నారు. సబ్‌స్క్రిప్షన్‌లపై యాపిల్ 30 శాతం కమీషన్ ఫీజు వసూలు చేస్తున్నందున, ఐఓఎస్‌పై ఈ ఛార్జీ అధికంగా ఉండనుంది. ఆండ్రాయిడ్‌పై ఈ సేవలకు సంబంధించి స్పష్టత రాలేదు. ఈ వారంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో మెటా వెరిఫైడ్‌ను ప్రారంభించి, తర్వాత మరిన్ని దేశాలకు విస్తరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!