శాంసంగ్‌ నుంచి రెండు కొత్త ఫోన్లు

దేశంలో 5జీ ఫోన్లకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని రెండు కొత్త ఫోన్లను శాంసంగ్‌ తీసుకొచ్చింది.

Updated : 30 Mar 2023 09:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో 5జీ ఫోన్లకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని రెండు కొత్త ఫోన్లను శాంసంగ్‌ తీసుకొచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గెలాక్సీ ఏ54, ఏ34 5జీ ఫోన్లను శాంసంగ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ (మొబైల్‌ వ్యాపారం) అక్షయ్‌ రావు విడుదల చేశారు. ఈ రెండు ఫోన్లూ నీటిలో లేదా కింద పడినా తట్టుకునేలా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ‘గెలాక్సీ ఏ54లో 50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ లెన్స్‌, ఏ34లో 48 మెగాపిక్సెల్‌ ఓఐఎస్‌ ప్రైమరీ లెన్స్‌లు ఉన్నాయి. తక్కువ వెలుతురులోనూ ప్రకాశవంతమైన చిత్రాలు తీసేందుకు వీలవుతుంది. 8జీబీ+ 128 జీబీ గెలాక్సీ ఏ54 ధర రూ.38,999 ఉండగా, 8జీబీ+ 256జీబీ ఫోను ధర రూ.40,999గా ఉంది. గెలాక్సీ ఏ34 ధర రూ.30,999 (8జీబీ+ 128జీబీ), రూ.32,999(8జీబీ+ 256జీబీ)గా ఉన్న’ట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని