రియల్‌మీ నుంచి సీ55

బడ్జెట్‌ ఫోన్ల విభాగంలో కొత్త ఫోన్‌ సీ55ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రియల్‌మీ ప్రకటించింది. బుధవారం రియల్‌మీ గ్లోబల్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ శ్రీహరి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు.

Updated : 30 Mar 2023 09:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: బడ్జెట్‌ ఫోన్ల విభాగంలో కొత్త ఫోన్‌ సీ55ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రియల్‌మీ ప్రకటించింది. బుధవారం రియల్‌మీ గ్లోబల్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ శ్రీహరి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. అత్యాధునిక ఫీచర్లతోపాటు, శక్తిమంతమైన పనితీరుతో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. 64 ఎంపీ కెమేరాతో తీసుకొచ్చినట్లు చెప్పారు. 15-16 కోట్ల స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో తమకు 14% వాటా ఉందన్నారు. మరింత విస్తరించే దిశగా కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో 30,000 స్టోర్లు ఉన్నాయని, 2023 నాటికి వీటి సంఖ్యను 50,000కు పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. సీ55లో మూడు మోడళ్లు ఉన్నాయని, ఆఫర్లు పోను రూ.9,999, రూ.11,999, రూ.12,999కు లభిస్తాయని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు