ఎన్ఆర్ఐలకు దేశంలో సంపాద‌న‌కే ప‌న్ను

ఎన్ఆర్ఐల ఆదాయం భార‌త్‌లోని వ్యాపారం లేదా వృత్తి నుంచి పొంద‌క‌పోతే పన్ను వర్తించ‌దు

Published : 16 Dec 2020 18:34 IST

ఆదాయ పన్ను విషయమై ప్రవాస భారతీయుల్లో నెలకొన్న సందిగ్ధతను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తొలగించారు. ప్రవాస భారతీయులు కేవలం భారత్‌లో ఆర్జించే సంపాదనకు మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపారు. ఇతర దేశాల్లో సంపాదించే వాటికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ కొత్త పన్ను విధానంపై అధికారులు అయోమయానికి గురికావొద్దని ఆమె కోరారు.

ఎన్‌ఆర్‌ఐలు ఇతర దేశాల్లో ఆదాయం పొందవచ్చు… కానీ వారికి ఇక్కడ ఉండే ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను తీసుకునేందుకు మాత్రం తమకు హక్కు ఉందని అన్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఆదివారం ఒక ప్రకటన కూడా జారీ చేసింది. భారతీయ పౌరుడు ఇతర దేశాల్లో ఆర్జించిన సంపాదనకు పన్ను విధించబడదు… కానీ భారత్‌లో ఉండే వ్యాపారం లేదా వృత్తి నుంచి గానీ ఆదాయం పొందితే దానిపై పన్ను విధిస్తామని పేర్కొంది. అవసరమైతే ఈ నిబంధనను చట్టంలో చేరుస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని