టీకా దుష్ప్రభావాలకు బీమా వర్తిస్తుందా?

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం అంతా టీకాపైనే ఆధారపడుతోంది. మన దేశంలోనూ ఇప్పుడు సాధారణ ప్రజానీకానికి టీకాల పంపిణీ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో చాలామందికి ఒక సందేహం వస్తోంది....

Published : 05 Mar 2021 01:28 IST

రోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం అంతా టీకాపైనే ఆధారపడుతోంది. మన దేశంలోనూ ఇప్పుడు సాధారణ ప్రజానీకానికి టీకాల పంపిణీ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో చాలామందికి ఒక సందేహం వస్తోంది. కొవిడ్‌-19 టీకా తీసుకొన్నప్పుడు ఏవైనా దుష్ప్రభావాలకు లోనై.. ఆసుపత్రిలో చేరితే.. ఆరోగ్య బీమా పాలసీ వర్తిస్తుందా? లేదా? అని.. దీనికి బీమా నిపుణులు వర్తిస్తుందనే సమాధానమే ఇస్తున్నారు. ఏదైనా టీకాతో దుష్ప్రభావాలు కనిపించి, ఆసుపత్రిలో చేరితే.. బీమా రక్షణ ఉంటుంది. ఇది సాధారణ నిబంధనే. కరోనా టీకాకూ ఇదే నియమం వర్తిస్తుందని చెబుతున్నారు. కొవిడ్‌-19 టీకాతో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే.. అప్పటికప్పుడే టీకా కేంద్రాల వద్దే ఉచితంగానే చికిత్స లభిస్తోంది. అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. పెద్దాసుపత్రిలో చేరాల్సి వస్తుంది. అప్పుడే ఆరోగ్య బీమా అవసరం ఏర్పడుతుంది. కొవిడ్‌-19 టీకాలు మన దేశంలో దాదాపు నెల రోజులుగా ఇస్తున్నారు. కానీ, ఎక్కడా తీవ్రమైన సమస్యలు ఎదురైన సందర్భాలు నమోదు కాలేదు. అయినప్పటికీ పాలసీదారుల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేసేందుకు ఐఆర్‌డీఏఐ దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం మేలని నిపుణులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని