రూ.2లక్షల ధీమా..

పేద, మధ్యతరగతి వారికి అందుబాటు ప్రీమియానికే రూ.2లక్షల బీమా పాలసీని అందించే లక్ష్యంతో వచ్చిందే ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై). 18-50 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి ఈ బీమాను రూ.330 ప్రీమియానికే అందిస్తోంది కేంద్రం. పాలసీదారుడు మరణించినప్పుడు రూ.2లక్షలను నామినీకి చెల్లిస్తారు.

Updated : 17 Aug 2022 11:34 IST

పేద, మధ్యతరగతి వారికి అందుబాటు ప్రీమియానికే రూ.2లక్షల బీమా పాలసీని అందించే లక్ష్యంతో వచ్చిందే ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై). 18-50 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి ఈ బీమాను రూ.330 ప్రీమియానికే అందిస్తోంది కేంద్రం. పాలసీదారుడు మరణించినప్పుడు రూ.2లక్షలను నామినీకి చెల్లిస్తారు. బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి ఆధార్‌ అనుసంధానమైన ఎంతోమంది ఈ బీమా పాలసీని తీసుకున్నారు. ఏటా జూన్‌ 1 నుంచి 30 వరకూ దీనికి ప్రీమియం బ్యాంకు ఖాతా నుంచే వెళ్తుంది. కొన్నిసార్లు మే నెల చివరి వారంలోనూ ఖాతా నుంచి ప్రీమియం వెళ్లే అవకాశం ఉంది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. ఎవరికైనా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు..
*ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా ఉన్న శాఖకు వెళ్లి ఈ బీమా పాలసీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి.
* పాలసీ ఉంటే.. బ్యాంకులోనే లభించే క్లెయిం ఫారాన్ని పూర్తి చేయాలి. దీనికి పాలసీదారుడి మరణ ధ్రువీకరణను జత చేయాలి.
* నామినీకి సంబంధించిన వివరాలూ, కేవైసీ పత్రాలను సమర్పించాలి. క్లెయిం ఫారంలో కోరిన ఇతర పత్రాలనూ అందించాల్సి వస్తుంది.
* క్లెయిం ఫారాన్ని తీసుకున్న తర్వాత బ్యాంకు ఆ పాలసీ అమల్లో ఉందా లేదా తనిఖీ చేసి, సంబంధిత బీమా సంస్థకు ఆ వివరాలను పంపిస్తుంది.
*అన్ని వివరాలూ సరిగ్గా ఉంటే.. నామినీ ఖాతాలో బీమా పరిహారం రూ.2లక్షలు జమ అవుతాయి.
మీ పొదుపు ఖాతా నుంచి పీఎంజేజేబీవై కోసం రూ.330 చెల్లించారా చూసుకోండి. కొన్నిసార్లు ఆ పాలసీ డాక్యుమెంట్‌కు సంబంధించిన లింకునూ బీమా సంస్థలు పంపిస్తుంటాయి. దాని ద్వారా పాలసీ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోవచ్చు. బ్యాంకులోనూ, పాలసీలోనూ నామినీ వివరాలను మరోసారి తనిఖీ చేసుకోండి. లేకపోతే వెంటనే నామినీ పేరు నమోదు చేయించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని