జీఎస్‌టీ మాఫీ చేస్తే వ్యాక్సిన్ల ధరలు పెరుగుతాయ్‌

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లకు మినహాయింపు ఇస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 10 May 2021 10:01 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లకు మినహాయింపు ఇస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. వాటికి జీఎస్‌టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే, దేశీయ తయారీదార్లు ముడి పదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని, తద్వారా వినియోగదార్లపై భారం పడుతందని ఆమె వివరించారు. ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5 శాతం, కొవిడ్‌ ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై 12 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొవిడ్‌ ఔషధాలు, పరికరాలను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ ట్విటర్‌ వేదికగా వారికి సమాధానమిచ్చారు. ‘జీఎస్‌టీ నుంచి ఆయా వస్తువులకు పూర్తి మినహాయింపు ఇస్తే, వ్యాక్సిన్‌ తయారీదార్లు ఇన్‌పుట్‌ ట్యాక్సెస్‌ను సర్దుబాటు చేసుకోలేక, వాటిని అంతిమ వినియోగదార్లకు మళ్లిస్తారు. ఫలితంగా వాటి ధరలు పెరుగుతాయ’ని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని