covaxin: రాష్ట్రాలకు నేరుగా సరఫరా

‘కొవాగ్జిన్‌’ టీకాను భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ దేశంలోని వివిధ రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 14 రాష్ట్రాలకు టీకా అందించటం మొదలు...

Updated : 11 May 2021 10:14 IST

భారత్‌ బయోటెక్‌

దిల్లీ: ‘కొవాగ్జిన్‌’ టీకాను భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ దేశంలోని వివిధ రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 14 రాష్ట్రాలకు టీకా అందించటం మొదలు పెట్టినట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు  నేరుగా టీకా అందించటం మొదలు పెట్టాం’ అని ఆమె వివరించారు. ఇతర రాష్ట్రాలు కూడా టీకా కోసం తమను సంప్రదిస్తున్నట్లు, టీకా లభ్యత ప్రకారం ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని తెలిపారు. టీకా అందుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అసోం, చత్తీస్‌ఘడ్‌, గుజరాత్‌, జమ్ము కశ్మీర్‌, జార్ఘండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో డోసు ‘కొవాగ్జిన్‌’ టీకాను రాష్ట్రాలకు రూ.400 ధరకు ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని