రూ.100తో మదుపు..కొత్త పథకం

కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి కొత్తగా ఒక ఇండెక్స్‌ ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. కోటక్‌ నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) చివరి తేదీ ఈ నెల 14. ఈ

Published : 24 Jun 2021 14:44 IST

కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి కొత్తగా ఒక ఇండెక్స్‌ ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. కోటక్‌ నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) చివరి తేదీ ఈ నెల 14. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.100. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లోనూ ఇందులో మదుపు చేయొచ్చు. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం కాబట్టి, ఎన్‌ఎఫ్‌ఓ ముగిసిన తర్వాత యూనిట్ల క్రయవిక్రయాలకు అవకాశం ఉంటుంది.
దీని పనితీరును నిఫ్టీ 50తో పోల్చి చూస్తారు. ఇది ప్రధానంగా లార్జ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. నిఫ్టీ 50 సూచీల్లో ఉన్న కంపెనీలపైన అదే వెయిటేజీ ప్రకారం పెట్టుబడి పెడతారు. దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఇండెక్స్‌ పథకాలు అనువుగా ఉంటాయి. వచ్చే కొన్ని దశాబ్దాల పాటు మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో సాగిపోతుందనే అంచనాలు ఉన్నందున, ఆ వృద్ధి ప్రక్రియలో భాగస్వామిగా ఉండాలంటే.. ఇండెక్స్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం అవుతుంది. కోటక్‌ నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ పాసివ్‌ ఫండ్‌ కాబట్టి, ఫండ్‌ నిర్వహణ వ్యయాలూ తక్కువగానే ఉంటాయి. నిఫ్టీ 50 సూచీ గత అయిదేళ్ల కాలంలో 14.72 శాతం సగటు ప్రతిఫలం ఇచ్చింది. యాంఫీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి వివిధ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు 46 ఇండెక్స్‌ పథకాలు ఉన్నాయి. ఈ ఫండ్ల నిర్వహణలో మొత్తం రూ.20,426 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని