క్రమం తప్పని ఆదాయం వచ్చేలా..
జీవితంలోని పలు దశల్లోని ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా రాబడి వచ్చేలా చూసుకోవాలని అనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక వినూత్న పాలసీని తీసుకొచ్చింది. క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించడంతోపాటు, హామీతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనాలను అందించే ఈ పాలసీ పేరు ఎక్సైడ్ లైఫ్ గ్యారంటీడ్ వెల్త్ ప్లస్.
జీవితంలోని పలు దశల్లోని ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా రాబడి వచ్చేలా చూసుకోవాలని అనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక వినూత్న పాలసీని తీసుకొచ్చింది. క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించడంతోపాటు, హామీతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనాలను అందించే ఈ పాలసీ పేరు ఎక్సైడ్ లైఫ్ గ్యారంటీడ్ వెల్త్ ప్లస్. ఇది నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత జీవిత బీమా, పొదుపు పథకం. వినియోగదారుల అవసరాలను బట్టి, దీన్ని రెండు రకాలుగా ఎంచుకునే వీలుంది.
ఇన్కం ఆప్షన్ కింద పాలసీదారులు ఆరేళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత 30 ఏళ్లపాటు హామీతో కూడిన స్థిరమైన చెల్లింపులను పొందేందుకు వీలుంటుంది. అదనంగా మెచ్యూరిటీ తర్వాత పాలసీదారులు తాము చెల్లించిన ప్రీమియం మొత్తాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. పిల్లల చదువులు, వివాహం తదితర అవసరాల కోసం నగదు కావాలనుకునే వారు ఈ ఆప్షన్ను ఎంపికం చేసుకోవచ్చు. మరో ఆప్షన్లో పాలసీదారులు ఆరేళ్లపాటు ప్రీమియం చెల్లిస్తే.. నిర్ణీత వ్యవధి తర్వాత మెచ్యూరిటీ ప్రయోజనాలను ఏకమొత్తంలో పొందవచ్చు. అదే సమయంలో ఈ వ్యవధిలో జీవిత బీమా రక్షణా లభిస్తుంది. ఈ పాలసీని తీసుకునేందుకు కనీస వయసు 3 ఏళ్లు. గరిష్ఠంగా 60 ఏళ్ల వారి వరకూ దీన్ని ఎంచుకోవచ్చు. ఇన్కం ఆప్షన్ ఎంచుకునే వారికి కనీస వయసు 11 ఏళ్లు ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!