పెట్రోల్‌ విక్రయాలు కొవిడ్‌ ముందు స్థాయికి

దేశంలో ఇంధన గిరాకీ గత నెలలో పుంజుకుంది. కొవిడ్‌ మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లు, పరిమితులు క్రమంగా సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నాయి. పెట్రోల్‌ వినియోగం

Published : 02 Aug 2021 01:26 IST

దిల్లీ: దేశంలో ఇంధన గిరాకీ గత నెలలో పుంజుకుంది. కొవిడ్‌ మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లు, పరిమితులు క్రమంగా సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నాయి. పెట్రోల్‌ వినియోగం కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరడంతో మొత్తం ఇంధన వినియోగం జులైలో పెరిగింది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు జులైలో 2.37 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 17 శాతం అధికం. అలాగే 2019 జులై విక్రయాలు 2.39 మిలియన్‌ టన్నుల స్థాయికి చేరింది. డీజిల్‌ విక్రయాలు కూడా 2020 జులైతో పోలిస్తే గత నెలలో 12.36 శాతం పెరిగి 5.45 మిలియన్‌ టన్నులకు చేరాయి. 2019 జులైతో పోలిస్తే ఇంకా 10.9 శాతం తక్కువగానే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని