జులైలో 11శాతం పెరిగిన నియామకాలు

దేశ వ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు కొవిడ్‌-19 పూర్వ స్థితికి వచ్చాయని, జులైలో 11శాతం వృద్ధి కనిపించిందని నౌకరి.కామ్‌ జాబ్‌స్పీక్‌ నివేదిక వెల్లడించింది.

Published : 07 Aug 2021 05:06 IST

హైదరాబాద్‌లో 16శాతం వృద్ధి

నౌకరి.కామ్‌ నివేదిక

ముంబయి: దేశ వ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు కొవిడ్‌-19 పూర్వ స్థితికి వచ్చాయని, జులైలో 11శాతం వృద్ధి కనిపించిందని నౌకరి.కామ్‌ జాబ్‌స్పీక్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో తగ్గిన నియామకాలు.. జూన్‌లో 15 శాతం పెరిగాయని, జులై నాటికి ఇది గరిష్ఠ స్థాయికి చేరుకుందని పేర్కొంది. నౌకరి.కామ్‌ ప్రతి నెలా జాబ్‌స్పీక్‌ పేరుతో ఉద్యోగ నియామకాల తీరును వివరిస్తూ ఉంటుంది. రంగాల వారీగా చూస్తే ఐటీలో 18శాతం వృద్ధి కనిపించింది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న హోటళ్లు, రెస్టరెంట్లు, ఎయిర్‌లైన్‌, పర్యాటక విభాగాల్లోనూ 36 శాతం వృద్ధి నమోదయ్యింది. అకౌంటింగ్‌-ట్యాక్సేషన్‌లో 27%, ఎఫ్‌ఎంసీజీలో 17%, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగంలో 13% చొప్పున నియామకాలు పెరిగాయి.ఐటీ హబ్‌లుగా పేరున్న బెంగళూరులో 17శాతం, హైదరాబాద్‌లో 16శాతం, పుణేలో 13శాతం చొప్పున ఉద్యోగ నియామకాల్లో వృద్ధి కనిపించింది. వ్యాపారాలన్నీ డిజిటల్‌కు మారుతున్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగాలు పెరుగుతున్నాయని నౌకరి.కామ్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని