మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వచ్చేసింది

మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్త ఎస్‌యూవీ మోడల్‌ ‘ఎక్స్‌యూవీ 700’ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఏడు సీట్లు, అయిదు సీట్ల

Updated : 15 Aug 2021 04:44 IST

ధర రూ.11.99 లక్షల నుంచి

దిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్త ఎస్‌యూవీ మోడల్‌ ‘ఎక్స్‌యూవీ 700’ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఏడు సీట్లు, అయిదు సీట్ల వేరియంట్లలో ఎక్స్‌యూవీ 700 లభించనుంది. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాసోలిన్‌ వెర్షన్‌లను కంపెనీ అందుబాటులో ఉంచింది. పండగల సీజన్‌కు ముందు బుకింగ్‌లు ‌ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. మహీంద్రా ‘ట్విన్‌ పీక్స్‌’ లోగోతో వచ్చిన మొట్టమొదటి ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. భారత్‌, అంతర్జాతీయ విపణుల కోసం ఈ ఎస్‌యూవీని కంపెనీ అభివృద్ధి చేసింది. ఎంఎక్స్‌ (బేస్‌), ఏఎక్స్‌3, ఏఎక్స్‌5, ఏఎక్స్‌7 వేరియంట్లలో ఇది లభించనుంది. ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌, ఆటో బూస్టర్‌ ల్యాంప్స్‌ వంటి అధునాతన ఫీచర్లను కొత్త మోడల్‌లో తీసుకొచ్చింది. సరికొత్త ఎక్స్‌యూవీ 700.. టాటా సఫారీ, హ్యుందాయ్‌ ఆల్కజార్‌, ఎంజీ హెక్టార్‌ ప్లస్‌ మోడళ్లతో పోటీపడే అవకాశం ఉంది. మాన్యువల్‌ వేరియంట్‌లో అమర్చిన 2.2 లీటర్‌ ఎంహాక్‌ డీజిల్‌ ఇంజిన్‌ 185పీఎస్‌ శక్తి, 420 ఎన్‌ఎం టార్క్‌ను, ఆటోమేటిక్‌ వేరియంట్‌ 450ఎన్‌ఎం టార్క్‌ను ఇవ్వనున్నాయి. ఇక 2-లీటర్‌ టర్బోఛార్జ్‌డ్‌ ఎంస్టాలియోన్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 200పీఎస్‌ శక్తి, 380 ఎన్‌ఎం టార్క్‌ను అందించనుంది.

ఎస్‌యూవీల పరీక్షకు ప్రూవింగ్‌ ట్రాక్‌: స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలు (ఎస్‌యూవీలు) పరీక్షించేందుకు ‘మహీంద్రా ఎస్‌యూవీ ప్రూవింగ్‌ ట్రాక్‌’ను శనివారం మహీంద్రా ప్రారంభించింది. తమిళనాడులోని కాంచీపురంలో రూ.510 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేసింది. వివిధ రకాల ఉపరితలాలు, సిమ్యులేషన్లపై ఎస్‌యూవీ కార్లను ఇంజినీర్లు పరీక్షించేందుకు ప్రూవింగ్‌ ట్రాక్‌ తోడ్పడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని